పులిహొర

మామిడికాయని చెక్కి(అదే తురిమి) పులిహొర చేస్తే, ఇలాగే ఉంటుంది. ముందు చెప్పినవన్నీ ఒక ఎత్తైతే .. పులిహోర ఒక్కటే ఒక్క ఎత్తు. మా ఇళ్ళల్లో చేసే పులిహోరలో తప్పనిసరిగా పచ్చిమిరపకాయలు మరియు ఎండు మిరపకాయలు ఉండాల్సిందే. వాటిల్ని పులిహోరతో పాటుగా తింటూ ఉంటే అస్సలు కారమే అనిపించదు.

మా ఇంట్లో అందరికి పులిహోరతో తప్పనిసరిగా ఇవి తినే అలవాటు, ఒక్క శ్రీమతికి తప్ప. మీరెప్పుడైనా పచ్చిమిరపకాయ కారంలేకుండా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అనుకున్నదే తడవుగా, మా ఇంటికి వచ్చేయండి..

ఎదో చెప్పానుకదా అని చెప్పాపెట్టకుండా వచ్చేయ్యకండి, మొహమాటానికయినా ఒక్క చిన్న కబురు.. అదేననండీ.. పాతరోజుల్లో అంటూటారే.. కాకితో కబురు చెయ్యమన్నట్లు .. మీరు కాకితో కబురు పంపకండి.. ఎందుకంటే, నాకు కాకి బాష రాదు కదా.. అందుకని .. వీలయితే ఒక ఈపత్రమో, లేక దూరవాణి యంత్రముద్వరానో తెలియజేయగలరు. మేముకూడా సిద్దంచేసుకోవాలికదా..

ఏమంటారు?? ఎప్పుడొస్తున్నారు??

4 స్పందనలు:

oremuna said...

మేమ్ రావాలంటే హై కమాండ్ పర్మిషన్ దొరకడం కష్టం :)

ఈ సారి బ్లాగర్ల మీటింగునకు మీరే ఇవి అన్నీ తీసుకొని వస్తే ఓ పనైపోతుంది కదా!

ఎనీ హౌ నైస్ బ్లాగింగ్ , గో ఆన్...

ఓ బ్రమ్మీ said...

బాగుందండీ మీ ఆలోచన.. కానీ ఒక చిన్న మార్పు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.. ఇవన్నీ నేను తీసుకురావడం కన్నా .. మీటింగుకు వచ్చేవారందరూ మా ఇంటికే వస్తే ఎలా ఉంటుందంటారు??

రాధిక said...

అమ్మ చేసేవి చాలా వరకూ బాగుంటాయండి.రేపు మీ పిల్లలని అడిగితే అమ్మమ్మ కన్నా అమ్మ బాగా చేస్తుంది అంటారు.మీరన్ని సార్లు అమ్మ,అమ్మా అంటుంటే నాకే కొద్దిగా ఏదోలా అనిపించింది.పాపం మీ శ్రీమతిగారు ఏమనుకుంటారో?:)

ఓ బ్రమ్మీ said...

రాధికగారు..

ఎంత అభాండం వేసారండి నామీద.. చిల్లుగారెలు విషయంలో శ్రీమతి బాగానే చేస్తోదన్న కదండీ.. కొంచం ఈ టపా చదవండి.. http://ubusu.blogspot.com/2008/04/blog-post_6121.html

ఎటొచ్చి, నాసతికి ఉన్న ఒక బలహీనతల్లా.. ప్రయత్నలోపమే.. ఒక్కసారి మొదలెట్టిందంటే.. అంతే సంగతులు .. ఇక పెట్రోల్, డీజిల్ వంటి ఇతరితరా ఇంధనాలవసరం అఖరలేదంతే..

అది సరేకానీయండీ.. ఇక్కడ మరొక్క విషయం.. సరదాగా స్పందిస్తారని తలుస్తాను.. మీ స్పందన చదివి, మా అమ్మ, మిమ్ములను ఈ విధంగా వర్ణించింది... "ఈవిడ అచ్చంగా ఒక సగటు కోడలు పిల్ల .."

ఏమంటారు ??

 
Clicky Web Analytics