భార్యతొ కలసి..

ఈ రోజు అర్థాంగికి గీతోపదేశం చేసినతరువాత, సతీ సమేతంగా ఈ పుట.. నా భార్యలో ఉన్న కొన్ని అవలక్షణాలలొ ఒకటి, బిడియం.. ఏ విషయాన్ని చొరవ తీసుకుని చెయ్యదు. నాకా భయపడేవాళంటే నచ్చదు. ఇవాళ పిచ్చాపాటి మట్లాడుతూ.. మామధ్య సంభాషణ, భావ వ్యక్తీకరణ వైపు మళ్ళింది.

అన్నదే తడవుగా.. తెలుగులో బ్లాగింగ్ చేసే  వాళందరి బ్లాగులు దగ్గరుండి చూపించి.. చదివించాను..

అందరికన్నా.. సరిగమలు అనే టైటిల్ తో ఉన్న .. http://vareesh.blogspot.com.. లోని ప్రస్తుత పుట చదివి.. చాలా నవ్వుకుంది.. ఇదే మంచి సమయం అనిపించి.. ఈవిషయాన్ని ఇలా.. తనని ప్రోత్సాహించేవిధంగా..

సాక్షి దిన పత్రిక - నా అభిప్రాయం

నిన్న విడుదలయిన సాక్షి దినపత్రిక, ఈరోజు ఉదయం చదివిన తరువాత నాలోని అభిప్రాయాన్ని మీతో ఇలా.. ఇక్కడ..

ఈ రొజు ఉదయం సాక్షి మెయిన్ ఏడిషన్ మాత్రమే చదవడం జరిగింది, సిటి ఏడిషన్ కుదరలేదు. పెపర్ చదువుతున్నంత సేపు, ఆద్యంతం.. మదిలొ నాకు ఆంగ్లంలొ విడుదలయ్యె Deccan Chronicle గుర్తుకువచ్చింది. సరళ మయిన భాష.. చూపరులకు ఆకట్టుకునే విధంగా రంగు రంగుల ప్రపంచం.. మొత్తానికి ఫరవాలేదనిపించింది.

నా భార్య పెదవి విరిచి, అంతగా ఏమీ లేదు .. అంది. అప్పుడనిపించింది, భార్య భర్తలు ఎప్పుడూ ఒక్క అభిప్రాయానికి రారని. నా అభిప్రాయంలో సాక్షి ఇదే విధంగా (నిస్పక్షపాతంగా.. నిర్బయంగా.. నిఖచ్చిగా.. నిజాన్ని నిజంగా.. ఇంతే అందంగా..) ఒక్క సంవత్సరం కనుక కొనసాగితే, ఆంగ్లంలో చెప్పలంటే, if they maintain the consistency of the same quality and maintain the neutral behaviour for one year.. అప్పటికి అస్సలు సాక్షి ఎవ్వరి పక్షమో తెలుస్తుంది. అందునా అప్పటికి, మనకి ఎన్నికలు వస్తాయి. కొడుకుగా తండ్రికి సంభందించిన పార్టికి గొడుగు పడతాడో.. లేక ఉన్నదున్నట్లు తెలియజేసే స్వతంత్ర ప్రతి పత్తి గల ఒక ప్రచార మాద్యమంగా సాక్షిని తీర్చిదిద్దుతాడో ఎదురుచూడవలసిందే.

లోటు పాటులు - నావరకు

౧) లోటు - పెపర్ క్వాలిటి

౨) పాటు - అందరిని దృస్ఠిలో ఉంచుకుని వివిధ రకాలయిన columns

౩) పాటు - ప్రతీ పేజి ఒక రంగుల ప్రపంచం

౪) పాటు - అన్నింటినీ మించి - ఖరీదు .. కేవలం రెండు రూపాయలు మాత్రమే..

మరిన్ని అభిప్రాయలు త్వరలో

బరహా Font తొ

ఈ రోజు నేను చేసిన మొదటి పని, బరహా font డౌన్లోడ్. తరువాత, ఇదిగో ఇలా మీతో ఇక్కడ. నిజం చెప్పాలంటే, నేను ఈ font ని చాలా రోజుల క్రిందటనే ఒకసారి ప్రయత్న్ం చేసి చూసాను. కానీ, అప్పుడు, ఇలా కూడా ఉపయోగించవచ్చని, నా ఈ మట్టి బుర్రకి తట్టలేదు.

ఏది ఏ మైతెనెమి, ఆలస్యంగా నయినా మెదలు పెట్టాను .. as an English saying reminds me, Better Late than Never, అన్నట్లు, ఇదిగో ఇలా..

ఈ ప్రస్తానం ఇలాగే కొనసాగాలని ఆసిద్దాం..

ఇట్లు, భవదీయుడు,

చక్రవర్తి

వేసవి కాలమా ?? వర్షా కాలమా ??

ఇది వేసవి కాలమా లెక వర్షాకాలమా.. కాదు కాదు .. కలికాలమా??

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల్నిచూస్తుంటే మీకేమనిపిస్తోమోదో కానీ నాకు మాత్రం కలికాలాన్ని తలపిస్తోంది.. గత రెండు / మూడు రోజులుగా.. ప్రస్తుతం మనం మార్చిలో ఉన్నామా లెకా అగస్టులొనా అని ఒక్కొక్కసారి తడబడుతున్నాను.

వరుణుడు నన్ను చూసి నవ్వుతున్నట్లుంది.. సురీడు నాతో దోబూచులాడుతున్నట్లుంది .. శని ఆదివారాలు కదా .. ఎంచక్కా చాలా పనులు చేద్దాం అనుకుటుంటే.. ఇంతలో ఎక్కడనుండి ఊడి పడ్డాడోగాని, నా పనులన్నింటికి పెద్ద అవరోధంలా తయారయ్యాడు, ఈ వరుణుడు. ఇంకేంచేస్తాం.. చక్కగా ఇంటి పట్టున ఉండి, పెళ్ళాం చేతి వంటకి సాయం చేస్తూ కాలం గడిపేయ్యల్సి వచ్చింది..
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

మరణం - ఎప్పుడు / ఎలా ??

మొన్న రఘువరన్ , సర్ ఆర్ధర్ క్లార్క్ .. నిన్న శోభన్ బాబు .. నేడు Judy Kay..


వీళ్ళలో రఘువరన్ మత్తు మందులకు బానిసై కాలం చేసాడు.. సర్ ఆర్ధర్ క్లార్క్ మరియు శోభన్ బాబు, వయసు మీదపడి పెద్దవారయ్యరు కాబట్టి కాలంచేసారు అనుకోవచ్చు..


ఏ పాపం ఎరుగని, జుడి కె జగొర్ స్కి, ని కాలం ఎందుకు కబళించింది ??
నేను అనవసరంగా కాలం మీద అభండం వేస్తున్నానేమో అనిపిస్తోంది. అస్సలు ఈ సోదంతాపక్కన పెడితే.. నిన్న.. ఈ 57 ఏళ ముసలావిడ కుటుంబ సమేతంగా అట్లాంటిక్ మహా సముద్రంలో విహరిస్తోంది.. ఇంతలో సముద్రంలోంచి, ఒక చేప, స్తింగ్ రె అనబడె ఓ చేప ఎగ్గిరి వీళ్ళు విహరిస్తున్న పడవలోకి దూకడానికి చేసె ప్రయత్నంలో, ఆ చేప కి ఉన్న తోక కాస్త మన హీరొఇన్ గారికి తగిలింది. అదే ఇది..



ఇది అది కాదండోయి.. ఇది ఆ జాతికి చెందినది.. తోక చూసారు .. చాలా పొడవుగావుంది కదూ??

అస్సలయిన సంహారి ఇదిగో ఇక్కడుంది..
ఇక్కడికి ఎలా వచ్చిందనుకుంటున్నారా?? నీటిలోంచి ఎగిరి పడవలో పడి ఇలా దొరికిపోయింది..

ఇదంతా ఉత్తిత్తినే అనుకుంటున్నారా?? news.AOL.com వెబ్ సైట్ లో ఈ లింకు చదవండి ..
http://news.aol.com/story/_a/stingray-leaps-onto-boat-kills-woman/20080320132409990001

----------------------------
Every thing is personal to ME, they are posted AS IS from my thoughts. Do you have any issues, keep it with you and never come back again to MYPLACE

అంతర్మధనం : ఇది శాపమా లేక పాపమా ??

ఈ రోజు ఉదయం స్నాననికి వెళ్ళి నప్పుడు, దురదృష్తవసాత్తు ఒక కాళ్ళజెర్రి నాకంట పడింది. అదేమిటో తెలియదు గానీ, చిన్నప్పటినుంచి ఒక అలవాటు. ఏమిటంటె.. కాళ్ళజెర్రి కనబడగానే, చెప్పు తెచ్చి అది చచ్చెంతవరకూ కొట్టటం .


ఆ తరువాత, యధావిధిగా స్నానకార్యక్రమాలు.. సంద్యావందనం, పూజ, .. ఇత్యాది కార్యక్రమలన్నీ చేస్తున్నా, నామదిలో ఇంతకముందు నాచేతిలో చనిపోయిన ఆ జీవి తాలుకా ఙ్నాపకాలు వెంటాడుతున్నయి.


ఆ జీవి ఎమి పాపం చెసుకుంది? మనుషులకు కనబడగానే చచ్చెటట్టు (చచ్చెంతవరకూ) తన్నులు తినాల్సి వచ్చింది? ఈ పరీస్తితిని, కాళ్ళజెర్రి కి శాపం అనుకోవాలా? లెక దాని కొట్టి చంపే మనిషి కి పాపం అనుకోవాలా?


----------------------------
Every thing is personal to ME, they are posted AS IS from my thoughts. Do you have any issues, keep it with you and never come back again to MYPLACE

తప్పు -- ఎవ్వరు చెప్పారు ??

చెవికి పొగు పెడితె తప్పు..
జుట్టుకి రంగు కొడితె తప్పు..
ఒంటికి టాటు వెస్తె తప్పు..
ఫ్రండ్స్ కూడ తిరిగితె తప్పు ..

బొడ్డుకి రింగు పెడితె తప్పు..
టైటుగా పాంటు వేస్తె తప్పు..
పెడిక్యుర్ తప్పు..
మనిక్యుర్ తప్పు..
వాక్సింగ్ తప్పు..
త్రేడింగ్ తప్పు..

నైట్ అంత మెలుకువ తప్పు..
9'0 క్లోక్ లెస్తె తప్పు..

బిగ్గరగ నవ్వితె తప్పు..
వళ్ళంత విరిస్తె తప్పు..

ఎగ్సాంస్ ఫీస్ నొక్కేస్తె తప్పు..
పరిక్ష వేళ క్రికెట్ తప్పు..
ఇంటికి లేటుగ వస్తె తప్పు..
ఫాషన్ చానల్ చుస్తె తప్పు..

హ్రిథిక్ రొషన్ ఇస్టమంటె తప్పు..
ఫొనులొ హస్కు కొడితె తప్పు..
మేడపైన నుంచుంటె తప్పు..
మటకి మాట చెబితె తప్పు..

పువ్వుని తుమ్మెద చూస్తె తప్పు..
తుమ్మెద తుమ్మెద కలిస్తె తప్పు..
కూర్చుంటె తప్పు..
నుంచుంటె తప్పు..

ఏమిటి, Boys సినిమా పాట లొని పంక్తులు కాపి కొట్టి ఇక్కడ పెడుతున్నానుకుంటున్నారా?

అదేమి లేదండి.. ఈరోజు Boys పాటలు వింటుంటే, కొన్ని విషయాలు మదిలో మెదిలి కుమ్మరి పురుగు తొలిచెస్తున్నట్లు తొలిచెస్తోంది..

ఇంతకి ఏమిటా విషయం అంటే.. పైన చెప్పినట్లెకాక..

నలుగురిలో ఉన్నప్పుడు, గట్టిగా మాట్లాడకూడదు..
భాధగా ఉన్నప్పుడు, గట్టిగా ఏడవకూడదు..
ఆనందంగా ఉన్నప్పుడు, గట్టిగా / పొట్ట పగిలేలా నవ్వకూడదు..

కంట్రోల్ చేసుకోవాలి.. ఏందుకని ?? Isn't that human is a social animal.. When animals can express their feelings with out any inhibitions, why not HUMAN??

----------------------------
Every thing is personal to ME, they are posted AS IS from my thoughts. Do you have any issues, keep it with you and never come back again to MYPLACE

ఎందుకిలా !!

నాకు ఇప్పటికి గుర్తు .. Bajaj Caliber Ad.. ఒక ట్రాఫిక్ జంక్షన్ దగ్గర రెడ్ లైట్ వేసి ఉన్నప్పుడు .. ఒక చూడచక్కని కుర్రాడు Bajaj Caliber మీద ఆగి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు .. ఇంతలో వెనుకనుండి కొన్ని కార్లు ఒక ర్యాలీగా, బోయి.. బోయి .. అంటూ ఆ సందులోకి రాబోతున్నాయి . తీరా చూడపోతే అది ఒక రాజకీయ నాయకుడి కి సంబందించినవి. ఇంతలో పక్కనుంచి ఆ రాజకీయ పార్టి కి చెందిన ఒక కార్యకర్త మన కుర్ర హీరోని చూసి గదమా ఇస్తూ ఉంటాడు .. రెడ్ లైట్ వేసి ఉన్నా ముందుకు వెళ్ళు .. నువ్వు మా నాయకుడి దారి కి అడ్డుగా ఉన్నావని భావన .. కానీ మన కుర్ర హీరోగారు కొంచం కూడా జడవకుండా గ్రీన్ లైట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు .



దీనికి, బజాజ్ వాళ్లు పెట్టిన పేరు "Unshakable". ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈవిషయం ఎందుకు అంటారా..



కోటి సెంటర్ .. ఉదయం 8:౦౦ గంటలు .. రుయీ .. రుయీ .. మంటూ .. నేను 50 kms / 55 kms మద్యలో ఉన్నప్పుడు .. కనుచూపు దూరంలో .. అచ్చం పైన చెప్పినట్లే ఒక యువకుడు రెడ్ లైట్ దగ్గర ఆగి ఉన్నాడు .. అటు ఇటు ఎవ్వరు లేరు.. అయినా మన కుర్ర హీరో గారు ముందుకు వెళ్ళటం లేదు .. నేను కూడా అక్కడ ఆగి అతనిని మెచ్చుకుందామనుకున్నంతలో , నేను ట్రాఫిక్ జంక్షన్ దగ్గరకి రావడం .. రెడ్ లైట్ కాస్తా గ్రీన్ లైట్ అవ్వడం ఒకేసారి జరిగి పోయ్యాయి .. నేను ఆగడం కుదరలేదు .. అతను ఎవ్వరికోసం ఎదురుచూడకుండా ముందుకు దూసుకు పోయాడు ..



తరువాత కొంత సేపు నేను అతను ప్రక్క ప్రక్క నే కలసి ప్రయాణం చేసినప్పటికీ .. నాలోని అంతరాత్మ ఒక్క నిమిషం ఆగి అతనినీ ఆపి మెచ్చు కోమని చేబునున్నా .. నిర్లక్ష్యంగా ముందుకు సాగి పోయాను ..



ఎవ్వరైనా మంచి పని చేస్తే మేచుకోవాలి అనేది అందరి కనీస దర్మం .. అట్లాంటిది .. మంచి పని కాక పోయినా, ఎవ్వరు చెయ్యలిసిన పని వాళ్లు చేసినప్పుడైనా మెచ్చుకోకపొతే ఎలా?



ఎందుకిలా చేసానా అని ఇప్పుడనిపిస్తోంది.. ఏది ఏమైనా ఒయీ సదురు మిత్రమా .. నా ఈ పోస్ట్ నీకే అంకితం .. నీ ట్రాఫిక్ విధానాలు జోహార్లు ..
--------------------------
Every thing is personal to ME, they are posted AS IS from my thoughts. Do you have any issues, keep it with you and never come back again to MYPLACE

మొదటి అంశం

నేను తెలుగులో బ్లాగడానికి స్పూర్తి, eతెలుగు.org. ఇక ముందు ఈప్రవాసం ఎంతకాలం సాగుతుందో .. ఏది ఏమైనా ఇలా తెలుగులో బ్లాగ్గింగ్ చెయ్యడం కొంచం కొత్తగా, కొంచం వింతగా మరికొంచం ఇబ్బందిగా ఉంది.

 
Clicky Web Analytics