కధే.. కానీ, మరచి పోలేనటువంటిది.. మూడవ భాగం

ఇంతవరకూ జరిగింది: ఒక వారాంతం నేను ఆఫీస్ నుంచి త్వరగా రావటం వల్ల, శాంభవీని ఆట్లాడించడానికి పార్కుకు తీసుకెళ్ళాను. పార్కు నుంచి తిరిగి వచ్చిన తరువాత పెరుగన్నం దగ్గర ప్రమాణం. (మొదటి పుట). అన్నీ సద్దు మణిగిన తరువాత శాంభవి గుండు చేయించు కుంటానన్న కోరిక, మా అందరి స్పందన ప్రతి స్పందనలు. ఆఖరుగా ఒప్పుకోలు. (రెండవ పుట). ఒక వేళ మీరు మొదటి పుట, రెండవ పుట చదవక పోతే, నా విన్నపాన్ని మన్నించి, ముందుగా అవి చదివిన తరువాత ఇది చదవండి. ఇదిగో ఇక్కడుంది దీని మొదటి భాగం. ఇది రెండవ భాగం.  ఇక ముందుకు వెళదాం.

---------------------------------

అభయమయితే ఇచ్చెసా గానీ, నా చిట్టి తల్లిని తన నల్లటి పొడుగాటి జుట్టుని లేకుండా చూడ గలనా.. దానికి తోడుగా, నా భార్య, ’ఏంటండీ .. మీరు మాట ఇవ్వడం .. అది అడగడం .. భలే బాగుందే.. మీ వరస. అదేదో చిన్న పిల్ల తెలిసో తెలియకో అడిగిందను కోండి, మంచి మర్యాద లేకుండా మీరు కూడా గంగిరెద్దులాగా తలూపేస్తారా..’ అంటూ యుద్ధాన్ని ప్రకటించింది.

’తెలిసో తెలియకో చిన్నది అడిగింది, ముందు వెనుకలు ఆలోచించ కుండా నెనే మాటిచ్చేసాను. ఇప్పుడు నేను మాట తప్పననుకో, రేపు పెద్దైయ్యాక, అది కూడా నాలాగా మాట తప్పితే నువ్వు భరించగలవా..’, సూటిగా ఒక్కటే ప్రశ్న. అంతే, చిరుబుర్రు లాడుకుంటూ ముందు గదిలోకి దారి తీసింది. ఇంతలో అమ్మ వచ్చే వేళయితే మమ్మల్ని బయటకు పంపించదనే భయంతో, శాంభవిని తీసుకుని, మెల్లగా జారుకున్నా. ధైర్యంగానైతే బయలు దేరాగానీ, మనసులో ఎదో తెలియని భాధ. నా చిట్టి తల్లిని జుట్టు లేకుండా చూడగలనా అన్న అనుమానం, చూసి తట్టుకోగలనా అన్న భయం. మెల్లిగా మంగలి దగ్గరకి చేరుకున్నాక, ఆఖరు సారిగా నా చిట్టి తల్లిని కన్నులారా చూసుకుని, వాడితో చెప్పా.

’కొంచం నెప్పి పుట్టకుండా గుండు చెయ్య గలవా..’ అంటూంటే.. వాడు వింతగా చూసాడు నావైపు.

’సారూ .. నాది ముప్పై సంవత్సరాల అనుభవం.. మీకెందు కండీ, రాండి .. కూకోండి.. మీకు తెలియకుండా గీకేత్తాగా..’ అన్నాడు.

’నాకు కాదు నాయినా .. నా కూతురు కి’ అనగానే, వాడొక వింత చూపు చూసాడు.

’ఏంటి సారూ, చిన్న పిల్లకి జుత్తు చూడబోతె చాలా బాగుంది.. గుండు గీకిత్తున్నారు.. చిన్న పిల్లలన్నాక తప్పులు చెత్తారు .. అంత మాత్రాన ఇంత చిచ్చ వెస్తారా.. వీల్లేదు బాబు.. నాను చెయ్య’ నంటూ మొండి కేసాడు. వాడిని కాస్తా బుజ్జగించి, బ్రతిమాలి, బామాలి, క్రింద మీద పడి, నా చిన్నారికి గుండు చేయించే సరికల్లా తల ప్రాణం తోకకొచ్చింది.

మెల్లగా ఇంటికి చేరుకుని, శాంభవికి దగ్గరుండి శ్నానం చేయించి గుండు నిండా చల్లాగా ఉంటూందని చందనం రాసా. ఇంతలో అమ్మ రానే వచ్చింది. వస్తూ వస్తూనే విషయం తెలుసుకుని, రుద్ర కాళిలా నామీద తోక తొక్కిన పాము పడగ విప్పినట్లు కస్సు బుస్సు లాడింది. కలి కాల మంటూ, నన్నూ.. నా కూతుర్ని అరగంట సేపు తిట్టిన తిట్టు తిట్ట కుండా తిట్టేసింది. మెల్లగా నేను తేరుకునే లోపుల, ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా నాకూతురు చల్లగా జారుకుంది.

శాంభవి ఇంట్లో లేదన్న విషయం మాకు అర్దమయ్యె సరికల్లా ఓ గంట పట్టింది. నాకు మెల్లగా భయం పట్టుకుంది. శాంభవిని వెతుక్కుంటూ రోడ్డు మీదకి బయలుదేరాను. నాకు తెలిసిన రోడ్లన్నీ తిరిగా. ఏక్కడా కనబడలేదు. భయం నన్ను మింగేస్తోంది, లేని పోని ఆలోచనలు మదిలోదూరి మెదడుని తొలిచేస్తున్నంతలో, లీలగా ఎందుకో నిన్న సాయంత్రం జరిగిన విషయం గుర్తుకొచ్చింది. గుండు పిల్లవాడు గుర్తుకొచ్చాడు. అంతే .. ఆఘ మేఘాలమీద అటు వైపు పరిగెత్తా.. నేను వాళింటికి చేరుకునే సరికల్లా .. నాకంట బడ్డ దృశ్యం నన్ను మారు మట్లాడనివ్వలేదు. శాంభవికి ఆ గుండు పిల్లవాడు వీడ్కోలు చెబుతున్నాడు. నా చిన్నారి, నన్ను చుస్తూనే ఎగ్గిరి దూకింది, నేను సిద్దంగా ఉన్నానా లేనా అన్న ఆలోచన చేయకుండా.

శాంభవి మీద వచ్చిన కోపాన్ని ఒక్క సారిగా తమాయించుకుని, ఎక్కడ తొందర పడి మళ్ళి నిన్న రాత్రిలాగా కొడతానో అన్న ఆలోచనతో శాంతించి, నా చిట్టి తల్లిని తనివి తీరా ముద్దాడు తుంటే, వింతగా ఓ చూపు చూసింది. సరే పిల్లల్ని భయపెట్టి పనులు చేయించు కోకూడదు, మంచిగా చెప్పి చేయించు కోవాలని తలంచి, శాంభవికీ క్లాసు పీకే కార్యక్రమాన్ని అప్పటికి వాయిదా వెసేసాను.

అరోజంతా శాంభవీని విడిచి పేట్టి ఉంటే ఒట్టు. ఎదో కోల్పోయామన్న భాధ. ఎదో తెలియని ఆందోళన. ఎం జరుగుతోందో తెలియని ఆవేదన. అన్ని కలసి ఇబ్బడి ముబ్బడిగా నన్ను కలగా పులగం చేసెస్తూ ఉంటే, ఎమి చెయ్యాలో తోచక సాయంకాలం శాంభవిని తీసుకుని పార్కుకు బయలు దెరా. పార్కుకు చేరుకున్నానన్న మాటే గానీ నిన్నటి హుషారు లేదు నాలో. పిల్లలందరూ ఒకరి తరువాత ఒక్కరు చేరుకుంటున్నారు. శాంభవికి గుండు అన్న విషయం వారు గమనించారో లేదొ కానీ వాళ్ళు గమనిస్తున్నారో లేదో అన్న తలంపే నాకు ఒక గిల్టీ ఫీలింగ్. వాళ్ళదేం పట్ట నట్టు యధా విధిగా క్రిందా మీదా మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నాకంట్లో పడ్డాడు ఓ గుండు పిల్లాడు. వాడు కూడా వీళందరితో ఆడుతూ పాడుతూ ఎగిరెగిరి దూకుతున్నాడు. వాడికో వార్నింగ్ ఇదాం అనుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళేంతలో వాడి తల్లి నిన్నటి నా భాధ్యతను తీసుకున్నట్లుగా.. అందరితో చలాకీగా తిరిగేస్తోంది. మన, తన, పర భేదం లేనట్లుగా అందరినీ తన పిల్లలుగా ఆడిస్తోంది. అంత మంది పిల్లల మధ్యలో వాళ ఆనందాన్ని నేనెందుకు చెడగొట్టాలనుకుని, కొంచం దూరంగా కూర్చోని వాళ్ళను గమనిస్తున్నాను. కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఎనిమిది కావస్తోందన్నట్లుగా చేతి గడియారం చూపిస్తోండంతో మెల్లగా శాంభవిని తీసుకుని బయలుదేరా. నాకు ఆశ్చర్యకరమైన విషయ మేమిటంటే, రాత్రి అవ్వస్తున్నా ఆ గుండు పిల్లాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. వాడి గురించి ఆలోచించడం మానేస్తే నాకే మంచిదని తలంచి, శాంభవి ని తీసుకుని ఇంటి వైపు అడుగులేసా.

ఎదో గతికా మన్నట్లుగా భోంచేసి, శాంభవీని పొట్ట మీద పడుకోబెట్టుకుంటూ పడక్కుర్చీలో మేను వాల్చా. నా స్తితి అర్దం చేసుకుందెమే, అమ్మ నా ప్రక్కకు చేరి, ’ నాయనా .. ఒంట్లో బాగోలేదా.. అన్నం సరిగా తినలేదు..’ అంది.

’ఏం లేదమ్మా.. శాంభవికి కొత్తగా ఆ వింత కోరిక ఎందుకొచ్చిందా అన్న ఆలోచనలో కొంచం కఠినంగా వ్యవహరించాను.’

’పోనీలేరా.. అయ్యిందేదో అయ్యింది, ఇక ముందు జాగర్తగా ఉంటే చాలు. మన పిల్ల మన మాట వింటే అదే పదివేలు. జుట్టు దేముంది ఇవ్వాళ పోతే రేపొస్తుంది’ అని సముదాయిస్తుంటే, భద్రకాళిలా చిందులేసిన మహాంకాళేనా ఈవిడ అని నాకు అనుమానమొచ్చింది. నిద్రలోకి జారుకున్న శాంభవీని తన చేతుల్లోకి తీసుకుని, ’ వెళ్ళి పడుకోరా.. రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్‍కి వెళ్ళాలి కదా’ అంది. నిజమే కదా అనుకుంటూ శాంభవీకి రెండు ముద్దులిచ్చి, అమ్మ చేతిలో పెట్టా.

నిద్రలేమితో ఉన్న నాకు ఆ రాత్రి, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. ఉదయాన్నే నిద్రలేవగానే అనుకున్నా, శాంభవిని దగ్గరుండి స్కూల్ దగ్గర దించాలని. అనుకున్నదే తడవుగా, నా అలోచనని అర్దాంగికి చెప్పెసి, భోజనాన్ని సిద్ధం చెయ్యమంటూ ఒక ఆజ్ఞ జారీచేసేసా. త్వర త్వరగా తయారయ్యి, శాంభవీని స్కూల్ దగ్గర దించడానికి తయ్యారయ్యా. నేను తనని దించి వెళతానన్న విషయం తెలుసుకున్న శాంభవి చలాకిగా తన పనులన్నీ తనే చేసేసుకుంటూ నాతో సమానంగా సిద్ధమయ్యింది.

స్కూలు గేటు దగ్గర దించి సాగనంపు తున్నంతలో, అదే గుండు పిల్లవాడు కారులో దిగుతూ కనబడ్డాడు. వీడిక్కడెందుకు తగలడ్డాడా అని అనుకుంటు ఉంటే.. నా చిట్టి తల్లి వాడిని పిలిచి చెయి చేయి కలుపుని చెంగు చెంగున లోపలికి దూసుకేళ్ళి పోయింది. ఇదెక్కడి పీడరా బాబూ అనుకున్నంతలో, కారులోంచి ఆ గుండుగాడి తల్లి తండ్రి మెల్లగా నా దగ్గరకు చేరుకున్నారు. వారి కళ్ళలో నీరు ఉబికి ఉబికి వస్తున్నట్లున్నాయి. బలవంతంగా ఆపుకుంటున్నట్లున్నారు.

’ఏమండీ .. శాంభవీని కన్న మీరు కారణ జన్ములు. మీకు మీ శాంభవీకి చేతులెత్తి మొక్కాలి’, అంటూ ఉంటే.. నేనేమి వింటూన్నానో నాకేమి అర్దం కావటంలేదు.

’నిన్న సాయంత్రం మీ గురించి వెతికే లోపే మీరు ఇంటికెళ్ళి పోయ్యారు..’ ఆ గుండుగాడి తల్లి అంటోంది.

’మీరు వెళ్ళి పోయ్యారు అనేకన్నా, మేము తేరుకునే సరికి చాలా రాత్రి అయ్యిందంటే బాగుంటుంది.’ ఆ తల్లి గొంతు పూడకపోయింది

’నిజంగా నండి’, అపిల్ల వాడి తండ్రి అందుకున్నాడు. ’ మావాడు ల్యుకేమియా అనే వ్యాధితో భాధ పడుతున్నాడు. ఆ వ్యాధి కోసం వాడిన మందులు మరియూ కెమో ధెరపీ దుష్‍ప్రభావం వల్ల, వాడి నెత్తిన జుట్టు పూర్తిగా రాలిపోయింది. దీంతో మా వాడు ఆత్మ న్యూనతా భావంతో ఎవ్వరితో కలవలేక ఒంటరి వాడై పోయ్యాడు. దానితో, వాడు ఎక్కడికీ తీసుకెళదాం అన్నా రావటం లేదు. సైకాలకిస్టుని సంప్రదిస్తే, ఇది ఒక మానసిక వ్యాధి అని ఇదీ మందులతో సరి అవ్వదని చెప్పాడు. మేము గత ఐదు నెలలుగా ఎంత ప్రయత్నించినా మావాడు ఇల్లు వదిలి రావటం లేదు. అట్లాంటి రోజుల్లో మీ అమ్మాయి మా అబ్బాయిని గత వారంలో యాదృశ్చికంగా కలిసింది. మా వాడిని ఎవ్వరూ గేలి చెయ్యకుండా తాను చూసుకుంటానని మాట ఇచ్చి, వాడితో స్నేహం చేస్తుంటే, ముందు మాకే భాధేసింది. మా వాడిని మార్చడం కోసం మీ అమ్మాయి ఇంత పని చేస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఇంతటి త్యాగ మూర్తిని కన్న మీరు ధన్య జీవులు’ అంటూ .. రోడ్డు అని కూడా గమనించ కుండా కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతున్న దంపతుల్ని చూస్తున్న నాకు నా చిన్నారి ఎంత ఎదిగి పోయిందో అనిపించింది.

అంతటి సున్నిత మనస్కురాలినా నేను కొట్టింది అన్న అలోచన నన్ను ఆశాంతం దహించి వేసింది. ఇదంతా తెలుసుకున్న నేనూ ఏడుస్తోంటే.. ఎమి జరిగిందో తెలియక వారూ తడబడ్డారు. కొద్ది సేపటికి తెరుకున్న నేను మనసులో..

’చిట్టి తల్లీ.. ఎంతటి నిస్వార్ద ప్రేమ నీది. ప్రేమలో పరమార్దమే గానీ, అర్దముండదని నాకు నేర్పిన గుణపాఠాన్ని నేనెప్పుడూ మరచిపోను. నిన్ను శిక్షించిన నన్ను ఆ దేవుడు నన్నెందుకు శిక్షించలేదా..’ అని భాధ పడ్డా. ఎప్పుడో చదివిన కొన్ని మాటలు గుర్తుకొచ్చాయి.

The happiest people on this planet are not those who live on their own terms, but are those who change their terms for others inspire others.

-----------------------------------------------

ఆఖరున, ఈ మొత్తం కధానిక నాకు forward గా వచ్చిన ఒక మాస్ మైల్ నుంచి అని గమనించగలరు. మీకూ ఇట్లాంటిదే ఒకటి వచ్చి ఉంటుంది. కధ కొంచమే, దాని చుట్టు అల్లిన పరిస్తితులు అన్ని నా స్వంతం. కాళిదాసు కవిత్వం కొంచం, దానికి తోడు మన పైత్యం కొంచం అన్నట్లుగా అస్సలు దాని చుట్టు నేను కల్పించుకున్న కధానికే ఇది. ఎలా ఉంది?


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్

కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

కధే.. కానీ, మరచి పోలేకున్నాను.. రెండవ భాగం

ఇంతవరకూ జరిగింది: ఒక వారాంతం నేను ఆఫీస్ నుంచి త్వరగా రావటం వల్ల, శాంభవీని ఆట్లాడించడానికి పార్కుకు తీసుకెళ్ళాను. పార్కు నుంచి తిరిగి వచ్చిన తరువాత పెరుగన్నం దగ్గర ప్రమాణం. ఒక వేళ మీరు మొదటి పుట చదవక పోతే, నా విన్నపాన్ని మన్నించి, ముందుగా అది చదివిన తరువాత ఇది చదవండి. ఇదిగో ఇక్కడుంది దీని మొదటి భాగం. ఇక ముందుకు వెళదాం.

-----------------------------------------

శాంభవి పరుగు పరుగున వెళ్ళి మూతి కడుక్కుని వచ్చి నా ప్రక్కన చేరింది. ఇంతలో లోపలి నుంచి, ’భోజనం తయారయ్యింది .. వడ్డిస్తున్నాను.. రండీ..’ అంటూ కేకేసింది నా అర్దాంగి. చిన్నదాన్ని అలాగే చంకనేసుకుని మధ్య గదిలోకి వెళ్ళి కూర్చున్నా. శాంభవి ఎదో ఎదో మాట్లాడుతోంది. కానీ నాకేమీ బుర్రలోకి ఎక్కటం లేదు. ఎందుకంటే, ఇందాక పెద్ద సత్య హరిశ్చంద్రుడి లాగా వాగ్దానం అయితే చేసేసాను కానీ మనసులో ఒక్కటే భయం. ఇప్పుటికిప్పుడు ఏమి కొనమని అడుగుతుందోనని భయం. భోజనానికి కూర్చున్న నాకు తోడుగా మా అమ్మ, భార్య రాగానే, చిన్నదాన్ని క్రింద పడుకో పెట్టి, భోజనానికి ఉపక్రమించా. వంట లన్నీ ఘుమ ఘుమ లాడుతోంటే, చక్కగా కంది పొడి వేసుకుని కొంచం ఎక్కువే లాగించేసా. అందరం భోజనాలయిన తరువాత, అమ్మేమో తన గదిలోకి చేరి మెల్లగా నిద్రకి ఉపక్రమించడానికి ప్రయత్నిస్తోంది. భార్యమో అంట్లన్నీ తోమేస్తే, ఉదయం పని తగ్గుతుందని, వాటిని ఒక పట్టు పట్ట డానికి ఉపక్రమించింది. శాంభవి నిద్ర పోవడం లేదు. అదిగో అప్పుడు మొదలైంది మా ఇద్దరి మధ్య అస్సలైన సంభాషణ.

’నాన్నా!! ఇందాక నువ్వు నాకేది కావాలంటే అది ఇస్తాన్నావు గదా..’ అంది చిన్న తల్లి

’అవును తల్లీ.. కానీ ఇప్పటికిప్పుడు ఒక వీడియో గేమో.. కంప్యూటరో.. అడిగావనుకో .. డబ్బులు లేవు కదా.. అందుకని.. కొంచం ఖర్చు తక్కువలో ఎదైనా అడుగు. తెస్తా’ అని భరోసా ఇస్తూనే, గుండెలు చిక్క బట్టుకున్నా.

’అవేమీ వద్దు నాన్నా.. నిన్ను ఖర్చు పెట్టే పనేమీ ఆడగనూ..’

’సరే తల్లీ.. ఏమె కావాలి??’.. పైన కొటి దేవుళ్ళను ప్రార్దిస్తున్నా

’మరే... మరే.. నేను గుండు చేయించు కుంటా.. రేపు నన్ను మన మంగళోడి దగ్గరకు తీసుకెళవా!!’, బుంగ మూతి పెట్టుకుని అడిగింది. నాకు అర్దంకాలేదు. భ్రుకుటి ముడి పడింది. నేను విన్న మాటలు నిజమేనా అన్న అనుమానంతో.

’నాన్నా.. వింటున్నావా.. నేను గుండు చేయించు కుంటా.. రేపు నన్ను బయటకు తీసుకు వెళతావా..’ కొంచం గట్టిగా అంది నా చిన్నారి శాంభవి.

’ఏంటీ!!!’ ప్రక్క గదిలోంచి అమ్మ నిద్రలోంచి ఉలిక్కి పడి లేచి వచ్చి కోపంగా చూస్తూ...

’ఏమే.. చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు.. ఏంటి ఆ మాటలు .. ’ వంటింటి లోంచి భార్య

’ఇదంతా నీ నిర్వాహకమే .. చూడు అది ఎట్లాంటి మాటలు మాట్లాడుతోందో.. ’, అమ్మ కొనసాగిస్తూ, ’నీ తోటి పిల్లలు అలాగే తిరుగుతున్నారే.. నీ కెందు కొచ్చింది ఆ అలోచన. హమ్మ!!! గుండు లేదు ఏమీ లేదు .. గమ్మున కళ్ళు మూసుకుని పడుకో’, అంటుంటే, నాకు వెంటనే సాయంకాలం చూసిన గుండు పిల్లవాడు వాడి తల్లి గుర్తుకొచ్చారు.

’ఏమిరా ఆలోచిస్తున్నావు.. అది మాట్లాడేది ఎమైనా అర్ద మవుతోందా.. ఆడ పిల్లని ఆడ పిల్ల గా పెంచరా అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు, అదేం మాట్లాడుతోందో. ఇదంతా నీ పెంపకమేరా. ఏం సమాధానం చెబుతావో చెప్పు’, అని అమ్మ గదమాయించేంత వరకూ నేను విన్నది నిజమేనన్న విషయం అవగతమవలేదు. శాంభవి చూడకుండా అమ్మకి కనుసైగ చేసి, ’అమ్మా!! నువ్వేళ్ళి పడుకో.. ఇది నాకు, నా కూతురు మధ్య విషయం’ అని అమ్మని అక్కడనుంచి పంపేసాను. ఎదో సణుక్కోంటూ వెళ్ళి పోయింది. ’ఏమిటండీ .. మీరి మరీనూ.. చిన్నదానికోసం కన్న తల్లిని అంత మాట అంటారా’, అంటూ భార్య అమ్మని వెనకేసుకుని రాబోయింది. శ్రీమతికీ ఒక చిన్న కనుసైగ చేసి, ’నీ పని నువ్వు చేసుకో..’ అంటూ గదమాయించేసా.

’ఏంటో .. ఈ తండ్రీ కూతుళ్ళ విషయం మనకు అర్దం కాదత్తయ్యగారూ.. మీ కెందుకు గానీ మీరు పడుకోండి, రేపు పొద్దున నీళ్ళొస్తాయి కదా, నేను పడుకుంటున్నాను.’ అంటూ మా పడక గదిలోకి దారి తీసింది.

ఇక మధ్య గదిలో నేను శాంభవే మిగిలాం. గొంతుక సవరించుకుని, మెల్లిగా మొదలు పెట్టా. ’చిన్నారీ, నీ జుట్టు చాలా పొడుగుగా ఉంది కదా.. ఇప్పటికిప్పుడు గుండు చేయించాం అనుకో అంత జుట్టు పోతే రావడానికి చాలా రోజులు పడుతుంది. కాబట్టి వద్దులేరా’ అన్నాను.

’అదేంటి నాన్నా!! నువ్వేనా ఈ మాటలనేది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నువ్వే కదా చెప్పావు. నేను నిన్ను డబ్బులు కూడా అడగటం లేదే. నువ్వేకదా హరిశ్చంద్రుడు కధ చెప్పింది..’ అంటూ ఇంకేదో చెప్పబోతోంటే, మధ్యలో దూరి, ’ అదికాదు తల్లీ, ఆడ పిల్లలు గుండు చేయించు కోరాదు’ అన్నాను

’ఏం? ఎందుకని?’ ఎదురు ప్రశ్న వేసింది. సమాధానం నాదగ్గర ఉంటే కదా. అవును నిజమే ఆడవాళు గుండు చేయించుకో వద్దని ఎవ్వరు చెప్పారు?? ఎక్కడ వ్రాసారు. శాంభవి చేత ఆ నిర్ణయాన్ని మార్చడం కోసం చాలా ప్రయత్నం చేసా. వినేట్టట్టు లేదే. విస్వ ప్రయత్నం చేసిన తరువాత, చివ్వరకు విసుగెత్తి,  ’హాయ్.. ఎంత మంది ఎన్ని మాటలు చెబుతున్నా నీ మాట నీదే కానీ మా మాట వినవా..’ అంటూ ఒక్కటిచ్చా. పాపం బాగా తగిలిందనుకుంటా.. ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. ఈ చిన్నది ఎందుకిలా అడిగిందా అని అలోచిస్తూండగా, సాయంత్రం చూసిన గుండు పిల్లవాడు గుర్తుకొచ్చాడు. ఇదంతా సావాస దోషం అని నన్ను సమర్దించుకుని, ఎలాగోలా ఆ పిల్ల వాడి స్నేహాన్ని మాన్పించేయ్యాలని నిర్ణయంచుకున్నా. ఎందుకంటే, చాలా మంది పిల్లలు, వారి చుట్టూ ఉన్న వారిని అనుకరిస్తూ ఉండడాని సాధారణంగా మనం గమనించే ఉంటాం కనుక.

చిన్నదాన్ని నిద్ర పుచ్చా గానీ, నాలోని ఆత్మ నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. మనమే ఇచ్చిన మాట మీద నిలబడక పోతే, చిన్న పిల్లలు ఎవ్వరిని ఆదర్సంగా తీసుకుంటారు. రేపు పెరిగి పెద్దైన తరువాత వాళ్ళు కూడా, ఇచ్చిన మాటలు తప్పి ప్రవర్తిస్తే.. ఈ ఊహ తలచుకుంటేనే భయం వేస్తోంది. ఆ రాత్రి అంతా కాళ రాత్రే. ఒక వైపు శాంభవిని కొట్టానే అన్న భాధ, మరో వైపు ఇచ్చిన మాటపై నిలబడాలా లేక మాటకు కట్టుబడి నా చిన్న తల్లికి గుండు చేయించాలా అన్న వేదన. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. సూర్యుడు కూడా ఏమి జరుగుతుందా అన్న ఉత్సాహంతో కొంచం తొందరగానే వచ్చేసాడనిపించింది. నిద్ర లేమి నాలో కొట్టొచ్చినట్లుగా కనబడు తోంది.

కాలకృత్యాలు, పూజ ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్నా.. ఏమి జరుగుతోందో అన్న భయం. శాంభవికేమో ఇవేమీ గుర్తులేనట్లు, సరదాగా చెంగు చెంగు మంటూ ఇల్లంతా బొంగరంలా తిరిగేస్తోంది. వాళమ్మేమో దాని వెనుక బ్రేక్‍ఫాస్ట్ తినిపించ డానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది. అమ్మేమో గుడికేళొస్తానంటూ బయటకు వెళింది. ఇంతలో..

’నాన్నా.. నీకిష్టం లేక పోతే, నేను గుండు చేయించు కోనులే..’, బుంగ మూతి పెట్టి అంటున్న శాంభవిని చూసే సరికి, కళ్ళు తిరిగినంత పనైంది.

’లేదు తల్లీ.. నువ్వన్నట్లే నీకు గుండు చేయిస్తా..’ అప్రయత్నంగా నాగొంతులోంచి నాకు తెలియకుండా వచ్చేశాయి.

కధే.. కానీ .. మరచి పోలేక పోతున్నాను .. మోదటి భాగం

ఒకానొక వారాంతం.. సాయంకాలం ఆఫీస్‍లో పని అంతా ముగించుకుని తొందరగా ఇంటికి చేరుకోవాలనే తాపత్రయంలో త్వరగా ఇంటికి బయలుదేరాను. హైదరాబాదు అంటే తెలియని దేముంది, అంతా ట్రాఫిక్ మయం. అటువంటి ఈ పద్మ వ్యూహం లాంటి రోడ్లు, ట్రాఫిక్ జామ్‍లూ ఛేదించుకుంటూ ఇంటికి చేరాను. హమ్మయ్య, ఇవ్వాళ జీవితంలో మొదటి రోజు ఇంటికి అనుకున్న వేళకి చేరుకున్నా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే, మా అమ్మాయి, శాంభవి, నాన్నా!! అంటూ ఎగ్గిరి దూకింది. ఈ మధ్య పిల్లలతో గడపడం లేదన్న విషయం చాలా ఆలస్యంగా అవగతమయ్యింది. ఇవ్వాళ త్వరగా ఇంటికి చేరుకున్నాం గనుక పిల్లని చక్కగా బయటకి తీసుకు వెళతానన్నాను. శాంభవి కంట్లో ఆనందానికి అవధుల్లేవు. భార్య కాఫీ కలప బోతే, వద్దని వారించి, కాళ్ళు కడుక్కుని, శాంభవితో దగ్గరలో ఉన్న పార్కుకు బయలు దేరాను.

వెనుక నుంచి,  ’జాగర్త రోయ్.. రోడ్డు మీద అటూ ఇటూ నడవకండి. వచ్చే పొయే వాహనాలు చూసుకుని రోడ్డు దాటు. చిన్నదసలే అల్లరి పిల్ల చెయ్యి వదలకు..’, మా అమ్మ ఇంకా ఎదో అంటోంది. లీలగా చిన్నప్పుడు అమ్మ అనే మాటలు ఇప్పుటికీ చెవ్వులో మారుమోగుతున్నాయి. ఇంత కాలమయినా నన్నింకా చిన్న పిల్లాడినే అనుకుంటుందేమో. చిన్నగా నవ్వుకుంటూ రోడ్డెక్కాం నేను నా బంగారు తల్లి. దగ్గర్లో ఉన్న పార్కుకు చేరుకున్నామో లెదో పొలోమంటూ చేరిపోయ్యారు చాలా మంది పిల్లలు. ఇంకే మా అమ్మాయికి నాతో పనిలేక పోయింది. అంతా ఒకళ్ళ చుట్టూ మరికరు చేరి పరుగులే పరుగులు. మధ్య మధ్యలో అప్పుడప్పుడూ నేను గుర్తుకొచ్చినప్పుడల్లా, శాంభవి నావైపు తిరిగి ఒక చిన్న నవ్వు విసిరేసి మళీ ఆటల్లో లీనమైపోతోంది. పిల్లలంటే స్వతహాగా ఇష్టం గనుక ఇక అక్కడున్న పిల్లల్లో తన పర భేధం పరచిపోయు నేనూ అందరినీ ఆడిస్తూ సరదాగా కలిసిపోయా. కొంత మంది పిల్లల తల్లులు నన్ను చూసి, కొంచం దూరంగా నిల్చోని వారు వారు పిచ్చా పాటి వేసుకుంటున్నారు. నేను కూడా అది గమనించనట్టు పిల్లలతో పిల్లవాడిగా కలసిపోయి వాళందరినీ ఆడిస్తూ కాలం గడిపేసా.

ఇలా తెలియకుండానే చీకట్లు పడడం ఒకళ్ళ తరువాత ఒకళ్ళు చిన్నగా జారుకోవడం గమనించే సరికి రాత్రి ఎనిమిదయ్యింది. మెల్లాగా అందరినీ గదమాయించి, ఒక్కక్కరినీ ఇంటి ముఖం పట్టించే సరికి తల ప్రాణం తోకలోకి చేరిందనుకోండి. అలా అందరం కలసి చేయి చేయి కలసి మానవ హారంగా బయలు దేరాం. ఒక్కొక్కళ్ళనీ వారి వారి ఇండ్ల దగ్గర దించి, మెల్లాగా నేను శాంభవీ ఇంటి దారి పట్టాం. శాంభవి మొహంలో ఎన్నడూ చూడనంత ఆనందం కొట్టోచ్చినట్టు కనబడుతోంది. గల గల ఎదో ఎదో మాట్లాడేస్తోంది. నవ్వుతూ అన్నింటికీ బదులిస్తూ, తన చిన్న తనానికి ఆనందిస్తూ అడుగులేస్తున్నాను. ఇంతలో ఒక ఇంటి ముందు ఠక్కున ఆగింది శాంభవి. నేను తేరుకునే లోపల, తుర్రుమంటూ ఆ ఇంటిలోకొ పరుగెత్తింది. ఆ ఇల్లెవరిదో, ఆ ఇంట్లో వాళ్ళెవ్వరో నాకు తెలియనందున గుమ్మం ముందు అయోమయంగా నిల్చోని పోయ్యాను. రెండు మూడు నిమిషాలలో ఆఇంట్లోంచి శాంభవిని ఎత్తుకుని మరోచెత్తో వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఆ ఇంటి ఇల్లాలు బయటకు వస్తూ కనబడగానే గుండె కుదుట పడింది. వాళబ్బాయిని చుస్తోంటే, నున్నగా గుండు చేయించుకున్నట్లుంది. శాంభవి నన్ను చూస్తూనే ఆవిడ చంక దిగి, వాళ్ళ అబ్బాయికి బై చెప్పి నన్ను చేరుకుంది. మెల్లగా ఇంటికి చేరుకునే సరికల్లా గడియారం తొమ్మిది చూపిస్తోంది.

కాళ్ళు చేతులు కడుక్కుని ముందు గదిలోని పడక్కుర్చిలో చేరగిల్లా. ఇంక వనుక గదిలో మాఅమ్మ శాంభవి ఇద్దరూ క్రిందా మీద పడుతున్నారు. బయటకెళ్ళి ఆడుకొని వచ్చావు కదా, చక్కగా స్నానం చెయ్యమంటోంది అమ్మ. నాన్న చెయ్యలేదు కదా నేనెందుకు చెయ్యాలంటోంది శాంభవి. మనసులో నవ్వుకుంటూ, ఈ తతంగం ఎప్పుడూ ఉండేదేగా అనుకుంటూ, వార్తా పత్రికలోకి తల దూర్చేసాను. కాసేపు పత్రిక చదివిన తరువాత, టీవీ ఆన్ చేసా. ఆ ఛానల్, ఓ ఛానల్, మూడు ఛానల్, పది ఛానల్, గాడిద గుడ్డు ఛానల్.. అంటూ ఈ మధ్య వచ్చిన అన్నింటినీ ఒక సారి పరీకిస్తూంటే.. వెనకాల గదిలో గొడవ ఎక్కువయ్యింది. సరే, ఆ విషయమేమిటో అని అనుకుంటూ, టీవీ కట్టేసి అక్కడికి చేరా. తీరా చూద్దునుకదా, శాంభవి పెరుగన్నం తినడానికి మారాం చేస్తోంది. వాళ్ళమ్మ, అదే నా భార్య, ఎదేదో చెబుతోంది. అయినా శాంభవి వినటం లేదు. ఇక నావల్ల కాదంటూ, కొంచం సహాయం చెయ్యవచ్చు గా అన్న చూపుతో నావైపు చూసింది నా అర్దాంగి. ఇక ఇప్పుడు నా వంతయ్యి నట్లుగా, పెరుగన్నం గిన్నెని చెతుల్లోకి తీసుకున్నా.

’చిన్నతల్లీ .. మంచి పిల్లవు కదా... ఇదేమో నాన్న ముద్దంట’, అంటూ శాంభవికి తినిపిచ్చడానికి ప్రయత్నం చెసా. మొదటి ముద్ద చట్టుక్కున తినేసింది. ఇందేంటి ఇలా తినేసిందని తేరుకునే లోపుల, ముందు గదిలోకి పరుగు లంకించుకుంది శాంభవి. వెనకాలే నేనూ.. ’నాకోసం కొంచం తిను తల్లీ ..’ అంటూ బుజ్జగించడం మొదలు పెట్టా. గిన్నే వైపు చూపిస్తూ.. ’నాన్నా చాలా ఉంది .. నావల్ల కాదూ.. అమ్మ కూరన్నం, పచ్చడన్నం, చారూ అన్నీ కలిపి కుక్కి కుక్కి పెట్టింది. చూడు నా పొట్ట ఎంత ముందుకొచ్చిందో. నావల్ల కాదూ..’ అంటూ మారాం చేయ్యబోయ్యింది. ’ఫరవాలేదమ్మా, ఈ కొంచం తినేయ్యి నీకేం కావాలంటే అదిస్తా ..’ అంటూ అభయమిచ్చేసా ధైర్యంగా. శాంభవి కళ్ళలో ఎదో తెలియని వెలుగు, ఒక్క సారిగా వెయ్యి ఓల్టుల బల్బు వెలిగినట్లుగా వెలిగాయి. అంతే సంగతీ అన్నట్లు, చక చకా నేను ముద్దలు కలిపి పెట్టేయ్యడం, గుటుక్కు గుటుక్కు మంటూ శాంభవి తినేయ్యడం నాకు ఎందుకో మింగుడు పడలేదు. ఏది ఏమైనా, నాకు కావలసిందల్లా పెరుగన్నం కాస్తా అయిపోవాలి. అది కూడా నా చిట్టి తల్లి ఎదురు చెప్పకుండా తినేయ్యడం. ఈ రెండూ పెద్ద కష్ట పడకుండా జరిగి పోయ్యేటప్పటికి, భార్య అమ్మ వైపు ఒక చిన్న లుక్కేసి, ’ఇంత దానికి మీరు ఊరకే హడావిడి చెస్తారు.. నా చిట్టి తల్లిని చూడండి చక్కగా ఒక్క మాటకి తినేసింది’, అన్నాను

ఇది నేనేనా..

ఎప్పుడూ గలగల మాట్లాడేస్తూ ఉండే నేనేనా ఈ నేను??? గత కొద్ది రోజుల నుంచి నాకేమైయ్యింది??? నన్ను ఏదో దయ్యం పట్టుకుంది. ఇక తప్పని సరిగా ఎవ్వరైనా మంత్రగాడి దగ్గరకు వెళ్ళాసిన సమయం ఆసన్నమయ్యింది. ఏమిటిది, మెదడంతా శూన్యమయి పోయింది. ఎటువంటి ఆలోచనలు రావటం లేదు. దీని వల్ల పని ఆలస్యమవుతోంది. యాజమాన్యం చేత తిట్లు తినే సమయమాసన్నమయ్యేటట్లు కనబడుతోంది. దేవుడా!!! ఎదైనా చెయ్యి..

మిత్రులు చెప్పిన చాలా విషయాలను పరి పరి విధాలుగా ఆచరించ ప్రయత్నం చేసా.. కానీ ఫలితం శూన్యం. ఎప్పటికీ ఈ గ్రహణం వీడుతుంది. ఎక్కడో చదివినట్టు, ’ఒక్క అడుగు వెనక్కి వెశామంటే దానర్దం వెనక పడ్డామని కాదు, ఆ అడుగుతో ముందుకు దూకడానికి తీసుకునే ఆసరా అని’, నేను ఇప్పుడున్న పరిస్తితిని తలచుకుని భాధ పడనా, లేక రాబోయే దూకుడుని తలచుకుని నిబ్బర పరచుకోనా.. అర్దం కావడం లేని పరిస్తితి.

ఎది ఎమైనా, నాకు మాత్రం ఎదో అయ్యింది. తప్పకుండా ఎదో చెయ్యాలి.. కానీ ఏమి చెయ్యాలి??

ఆడ పిల్ల పుట్టాలనుకుంటున్నారా???

అయితే ప్రొద్దుట పూట ఫలహారం మానేయ్యండి. అంతే.. గర్బాధారణ జరిగే రోజులలో స్త్రీలు కనుక బ్రేక్‍ఫాస్ట్ మానేస్తేనంట ఆడ పిల్లలు పుట్టడానికి ఎక్కువ అవకాశాలున్నాంట. ఏంటీ నామాట నమ్మటంలేదు కదా.. బ్రిటీషు శాస్త్రవేత్తలు ఈ రోజు పత్రికా ముఖంగా ఈ విషయాన్ని వెల్లడిచేసారు.

Exeter మరియు Oxford విశ్వవిధ్యాలయాల సంయుక్త పరిశోధనల ఫలితాలు చాలా చాలా క్రొత్త క్రొత్త విషయాలను తెలియజేసాయని Exeter విశ్వవిధాలయలో పని చేస్తున్న ఫియనా మాత్యు అనే శాస్త్రవేత్త తెలియజేసారు. ఈయన ప్రకారం గర్బాధారణ జరిగే రోజులలో తల్లులు కనుక ఉదయం వేళలలో తక్కువ కేలరీలు కలిగిన అహారాన్ని భుజించడం ద్వరా పుట్టబోయే పిల్లలలో మగ పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న విషయం ఋజువు అయ్యిందన్నారు. మానవ శరీరం ఉదయం వేళలలో ఎమీ భుజించక పోవడాన్ని, తక్కువ కేలరీ కలిగిన పదార్దం పెద్ద ప్రేవులలో ఉన్నట్లుగా గ్రహిస్తుందని, ఈ రకంగా తల్లి పోషక పదార్దానికి పుట్ట బోయె పిల్లలకు చాలా దగ్గరి సంభందం ఉన్నట్లు వారు విశదీకరించారు.

౭౪౦ (740) మంది మొదటి సారిగా గర్బం దాల్చిన యువతుల మీద జరిపిన సర్వే ఫలితాలను తెలియజేస్తూ, వారిలో ఎక్కువ శాతం తల్లులు మగ బిడ్డలకు జన్మ నిచ్చారని, వారంతా చక్కగా ఎక్కువ శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకున్నారని కూడా వివరించారు. తక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని భుజించిన మిగిలిన యువతులకు ఆడ పిల్లలు కలిగారనేది వారి వాదన.

పూర్తి వ్యాసాన్ని AOL వారి లింకు నుంచి చదవగలరు

దొంగిలించారు - పట్టించినవారికి లక్ష వరహాలు బహుమానం

ఆ మధ్య అల్లూ అర్జున్ నటించిన సినిమాలో (పేరు గుర్తుకు రావడం లేదు) విలన్లలో ఒక వ్యక్తి కళ్ళు హీరోగారు అపరేషన్ చేసి వేరే ఒకరికి పెట్టేస్తాడు. అందుకు దానం చేసిన వ్యక్తి విలన్‍గారు ఎలా జరిగిందంటే.. ఎవడో వచ్చాడు, కొట్టాడు.. అంటూ కళ్ళు దొబ్బెసాడంటాడు. అలాగే, ఏమైందో కానీ గత వారంలో ఎవ్వరో నా అలోచనలన్నింటినీ దొంగతనం చేసేసారు. బాస్కేట్ బాల్ ఆటగాడు, మైఖేల్ జోర్డాన్ నటించిన స్పేస్ జామ్ సినిమాలో చూపించినట్టు, ఎవ్వరో నాలోని అన్ని మెళుకువలన్నింటినీ దొంగిలించారు.

మెదడంతా శూన్యమైపోయింది. ఇట్లాంటి నన్ను నేను అద్దంలో చూసుకుంటే ఎదో కొత్తగా ఉంది. కొంపతీసి నన్ను కూడా బగ్స్ బన్నీలాంటి కల్పిత పాత్ర దోచుకెళ్ళ లేదు కదా!!! స్పేస్ జామ్ సినిమాలో ఒకేసారి బాస్కేట్ బాల్ ఆట ఆడే వారంతా వాళలో ఉన్న నైపుణ్యాన్ని కోల్పోతారు. అలాగే నేను నా నైపుణ్యాన్ని కోల్పోయాననిపిస్తొంది. ప్రపంచంలో క్రిందటి వారంలో ఎవ్వరైనా ఇలా కోల్పోయారా!!! అలాంటి వారుంటే, నాకు ఒక జాబు వ్రాయగలరు. ఎందుకంటారా.. మనం అందరం ఒక చోట చేరి భాధ పడదాం. మనందరినీ రక్షించే బిల్ ముర్రే లాంటి నాయకుడేక్కడైనా ఉన్నాడా??? అదేనండీ స్పేస్ జామ్ చిత్రంలో మైఖేల్ జొర్డాన్‍ను కార్టూన్ ప్రపంచం నుంచి నిజ జీవితంలోకి తీసుకు రావడానికి ప్రయత్నించిన సహ పాత్రధారి.

ఈ విషయం గురించి రెండు పుటలు ప్రచురించానంటేనే హాస్యాస్పదంగా ఉందికదూ.. ఏం చేస్తాం.. అదీ పరిస్తితి. చిత్తగించ వలెను.

ఏందుకిలా జరుగుతోంది??

గత వారం మొత్తం అస్సలు పని నడవలేదు. కానీ కార్యాలయానికి వెళుతున్నాను, వస్తున్నాను. ఎదో యాంత్రికంగా రోజంతా గడుస్తోంది. ఎదో కోల్పోయినట్లు.. ఎదో లోపించినట్లు.. ఎందుకిలా నాలో ఈ స్తబ్దత?? ఏమీ చెయ్యలేక పోతున్నాను.. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండే నాలో ఒక్కసారిగా ఈ శూన్యం ఎలా ప్రవేసించిందో తెలియదు. కానీ మొత్తంగా నేను అన్నింటిని కోల్పోయాననిపిస్తోంది. ఎందుకిలా జరిగింది?

ఎలా ఈ శూన్యాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడెప్పుడో చదివిన జోక్ ఒకటి ఇప్పుడు గురుకొస్తోంది. ఒక ఉద్యోగి తన భాధని ఈ క్రింద విధంగా వ్యక్తీకరించాడు

నేను కనుక ఇచ్చిన పనికి ఎక్కువ సమయం తీసుకుంటే, నేను చాలా నెమ్మదిగా పనిచేస్తున్నానంటారు
అదే నా పై అధికారి కనుక ఎక్కువ సమయం తీసుకుంటే, అతను బాగా ఆలోచించి చేస్తున్నాడంటారు

నేను కనుక ఇచ్చిన పనిని చెయ్యలేకపోతే, నేను భద్దకస్తు
అదే నా పై అధికారి కనుక చెయ్యలేకపోతే, అతను బాగా బిజీగే ఉన్నాడంటారు

నేను కనుక అడగకుండా ఏదైనా ఉపయొగమైన పనిచేస్తే ఎచ్చులుపోతున్నానంటారు
అదే నా పై అధికారి కనుక ఏదైనా ఉపయొగమైన పనిచేస్తే, అతను కొత్త విషయాలు శృష్టిస్తున్నాడంటారు

..

..

తెలుగులోకి తర్జుమా చేస్తుంటే అర్దం మారి పోతున్నందున, ఆంగ్లంలో..

When I Take a long time to finish, I am slow,
When my boss takes a long time, he is thorough

When I don't do it, I am lazy,
When my boss does not do it, he is busy,

When I do something without being told, I am trying to be smart,
When my boss does the same, he takes the initiative,

When I please my boss, I am apple polishing,
When my boss pleases his boss, he is cooperating,

When I make a mistake, I'm an idiot.
When my boss makes a mistake, he's only human.

When I am out of the office, I am wondering around.
When my boss is out of the office, he's on business.

When I am on a day off sick, I am always sick.
When my boss is a day off sick, he must be very ill.

When I apply for leave, I must be going for an interview
When my boss applies for leave, it's because he's overworked

When I do good, my boss never remembers,
When I do wrong, he never forgets

అలా, నేను క్రిందటి వారం అస్సలు పని చెయ్యకపోవడాన్ని, నా టీమ్‍లోని సభ్యులంతా నేను ఎదో క్రొత్త ఆలోచనతో సతమవుతున్నాననుకుంటున్నారు. ఎలా?? ఎలా?? నేను మాములు మనిషి నవ్వాలి? మునుపటిలా చలాకీగా పనిచేస్తూ, మా సంస్థకు కాలాయాపన లేకుండా, ఇచ్చిన పని మొదలు పెట్టాలి? అస్సలే, క్రిందటి వారమే క్రొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ అస్సలు అర్దం కావటంలేదు. ఎంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్‍నైనా ఇట్టే పట్టెసి, చట్టుక్కున ముక్కున పెట్టేసుకునే నేనేనా ఇలా ప్రవర్తిస్తున్నానా అని నామీద నాకే ఒక అనుమానం

లేక నేనేమైనా ముసలివాడినైనానా అన్న అనుమానం మొదలైంది. నాలోని తెలివి తేటలన్నీ ఒక్క సారిగా కోల్పోయానా అన్న భయం వెంటాడుతోంది. ఈ పరిస్తితి నాకు చాలా క్రొత్తగా ఉంది. ఇది నాకు ఒక్కడికేనా లేకా ఎవ్వరికైనా వస్తుందా?? ఎవ్వరైనా ఇట్లాంటి జబ్బుకు గురైనారా??? దీనికేమైనా మందు ఉందా???

ఎవ్వరినా.. ఎదైనా .. ఎలాంటిదైనా.. చెప్పండి.

Internet Quiz

Today, while passing time between the responses from  our team, came across this Internet Quiz. Scored 29 out of 29. Out of all the given questions, only one is guess work, that is the first popular social networking site, ie., Friendster. Except this, others are some kind of simple and tricky. Did you try?

సాక్షి వార్తాపత్రికపై నా అభిప్రాయం - రెండవది

గత కొన్ని రోజులుగా సాక్షి దిన పత్రికను క్రమం తప్పకుండా చదువుతున్నాను. గతంలో మాదిరిగా కంటే, ఇప్పుడు ఎక్కువగా అధికార పక్ష పత్రికగా అనిపిస్తోంది. ఎంతైనా తండ్రిగారిని, వారి ప్రభుత్వాన్ని కాదనలేరు కదా!!! ఈ పత్రిక ద్వారా ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలకు అర్దమవుతున్నాయనేది మాత్రం నగ్న సత్యం. కాకపోతే, ఊరికే పంచి పెట్టే పామ్‍ప్లేట్లను డబ్బులిచ్చి కొన్నుక్కుంటున్నట్లుంది. ఏది ఏమైనా చక్కగా కనులకు విందుగా బాగానే ఉంది.

ఇవాళ్టి విషయానికొస్తే.. పేపర్ బాయిస్ మీద మొదలు పెట్టిన వ్యాసం పేజీ తిప్పగానే వార్తాహరులు వైపు, రచనా వ్యాసాంగం రంగాలలో పనిచేసే వారి జీతభత్యాల వైపు మళ్ళించారు. కానీ రెండు పేజీలలోనూ ఉన్న ఫొటోలు మాత్రం పేపర్ బాయిస్‍వే వెయ్యడం ఇక్కడ గమనించ దగ్గ విషయం. పైకి మాత్రం పెపర్ బాయిస్ గురించి అన్నట్లనిపించేలా ఉన్న చిత్రలను చూసి భంగపడ్డాను. తీరా అందులో అస్సలు విషయమల్లా ఏమిటంటే.. సాక్షి మొదలు పెట్టిన దగ్గర నుంచి, ఇందులో పని చేసే వారి జీతాలు పెరిగినాయంటూనే, ప్రతి పక్షాల్లాంటి ప్రత్యర్దుల పని వారి జీత భత్యాలు పెరగటం లేదని ముగించారు. వ్యాపారమన్నాక ఆ మాత్రం ఒడి దుడుకులు ఉండవక తప్పదు కదా!! ఈ మాత్రం దానికే అంత పెద్ద ఆర్టికల్ వ్రాసేయ్యాలా??

ఏది ఏమయినా, ఈ మధ్య సాక్షి వారికి వార్తలు తగాయనడంలో ఎంతో కొంత నిజంమేననీ, ఇదంతా స్థలాన్ని పూరించుకోవడానికె చేస్ ప్రయత్నాలనేది సత్య దూరాలు కావు. వీరు తోందరలోనే కొన్ని పేజీలను తొలగించేసి, పత్రికా పేజీల సంఖ్యను తగ్గించేస్తారనుకోవడం, అతిశయంకాదు. వీటన్నింటి లోకి నాకు నచ్చిన ఒక విషయమేమిటంటే, ప్రధాన పత్రిక చివ్వరి పేజీలో ఒక మంచి మాటను తెలియజేస్తూ వస్తున్నారు. ఈ తతంగం ఎలా ఉందంటే, బాలమురళీ సుబ్రమణ్యం గారు నిర్వహించే కార్యక్రమం, పాడాలని ఉంది లో చివరగా బాలుగారు ఒక మంచి విషయాన్ని ప్రజలకు విన్నవించుకుంటారు. అదే తరహాలో వీరు చివ్వరి పేజీలో చక్కగా ఒక చిన్న విషయాన్ని సున్నితంగా తెలియజేస్తున్నారు.

చుద్దాం ఇక ముందు వీరు ఏవిధంగా మారతారో.. అంతవరకూ.. సెలవు..

క్షమించాలి.. బాల సుబ్రమణ్యంగారిని, బాల మురళి గారిగా ప్రచురించినందులకు.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

భోజనం - భొజరాజు

నా చిన్నతనంలో చాలా కధలు విషయాలు మా తాతగారి వద్ద, మరికొన్ని మా అమ్మమ్మ వద్ద నేర్చుకున్నాను. వాటిల్లోంచి ఒకటి మీ కోసం ఇలా..

ఏమిటి?? భోజనమంటున్నాను.. అలాగే భొజరాజంటున్నాను .. అనుకుంటున్నారా!!! ఈ రెండింటికీ ఎక్కడ కలుస్తుందనుకుంటున్నారా??? తలపగలు కొట్టుకోండి. ఈ రేంటికీ ఎక్కడ పొంతన లేదు. కానీ ఆహారం విషయానికొస్తే, ఈ రోజుల్లో, హైదరాబాదు వంటి నగరాల్లో.. ప్రతీ సుభకార్యానికీ, ఎక్కువగా బఫేలు పరిపాటై పోయింది. అట్లాంటి బఫె నే ఈ నాటి నా ఈ పుటకి మూల కారణం. బఫే అనబడే ఈ తంతు, నక్కని చూసి .. (అయ్యొయ్యో.. పులిని చూసి నక్క అని అనాలికదా.. ఎదోలేండి.. ) అన్నట్లుగా.. "హైదరాబాదులో మా చుట్టాలు.. క్రిందటిసారి వాళింటిలో సుభకార్యం జరిగినప్పుడు, ఇలాగే పెట్టారు .." అని ప్రక్క ఊళ్ళలో ఉన్నవారుకూడా ఇదే పద్దతిని పాటించేస్తున్నరు. అదిగో అలాగే, క్రిందటి ఏడాది, విజయవాడలో కొన్ని పెళ్ళిళకు వెళ్ళి నప్పుడు ఒకటి రెండు సార్లు,  బఫె భొజనం చేసినట్లు గుర్తు.

ఇక అసలు విషయానికొస్తే.. భోజరాజుకి ఒకనాడు గొప్ప అవమానం జరిగింది. అదేమిటంటే.. తన దగ్గర పనిచేసే ఒక పరిచారకుడు రహస్యంగా ఎవ్వరికో ఉత్తరం వ్రాసుండగా, ఈ రాజుగారు చాటుగా దానిని చదవుతున్నారంట. ఇది గ్రహించిన అతను రాజుగారు చదువుతున్నరన్న విషయం, తాను గ్రహించినట్లుగా రాజుగారు పసి గట్టినట్లైతే బాగుండదు కదా అని, తెలియనట్లుగా ఉన్నట్లుంటూనే, కొంచం తుంటరిగా ఉత్తరం మధ్యలో ముగించెస్తున్ననంటూ పేర్కొన్నాడు. అంతే కాకుండా, ఒక మనో నిబ్బరం లేని ఒక వెధవ కూడా ఈ ఉత్తరాన్ని చదువుతున్నడు కనుక మిగిలిన విషయాలు తరువాత ఉత్తరంలో వ్రాస్తానని ముగించేసాడు. అంతట ఆ రాజు గారు, తనను ఒక వెధవగా పోల్చినందులకు చింతించి, తదుపరి తన సభలోకి వచ్చే వారందరినీ, "మూర్ఖా..!!" అంటూ సంభోదించడం మొదలుపెట్టారు. సభలోకొచ్చిన ప్రతీ వ్యక్తీ దీనికి ఆశ్చర్య చతికులై, రాజుగారికి ఎదురు చెప్పలేక, మౌనంగా ఆ అవమానాన్ని దిగ మింగు కుంటునారు. ఇది రాజుగారికి కొంత ఊరట నిచ్చినట్లైంది. ఇంతలో మహాకవి కాళిదాసుగారు రంగ ప్రవేశం చేసారు. రాజు గారు యధా ప్రకారం వీరిని కూడా.. "మూర్ఖా!!" అంటూ సంభొదిచే సరికి, మన మహాకవి గారు సంస్కృతంలో క్రింద చెప్పినట్లు చెబుతారు

ఖాద న్న గస్చామి, హాస న్న భాష్యే
గాతం న షోచామి, కృతం నా మన్యే
ద్వభాయం తృతియొ న భవాని రాజన్
కిమ్ కారణమ్ భొజ భవామి మూర్ఖః

దీని అర్ద మేమిటనిన.. నేను నడుస్తూ భుజించను, పొట్ట చెక్కలయ్యెలా నవ్వుతూ మాట్లాడను, ఇద్దరు తగువు లాడు కుంటుండగా మధ్యలో జేరి ఇద్దరి చేత వెధవగా నేననిపించుకోలేదు.. (ఇలా ఇలా ఇంకా ఎదో ఎదో అర్దం దాగి ఉంది. నాకు గుర్తున్నంత వరకూ ఇంతే.. మీలో ఎవ్వరైనా సంస్కృతం తెలిసిన వాళైతే దీని పూర్తి తాత్పర్యం తెలియజేసిన యడల చాల రుణ పడి ఉంటాను). ఇన్ని విషయాలలో నేను మూర్ఖుడిని కాదని ఋజువు అయినందున, నన్ను ఏవిధంగా మూర్ఖుడిని చేసావు .. ఓ రాజా?? అని తిరిగి ప్రశ్నించారు.

తరువాత కధ ఇప్పటికి అప్రస్తుతం. ప్రస్తుతానికి అవసరమయిన విషయమేమిటంటే.. మూర్ఖులందరూ నడుస్తూ భొజనం చేస్తారన్నది, మహాకవి కాళిదాసుగారి అభిప్రాయం. ఈ విషయమం నాకు చిన్నపుడే నూరి పోసారు కనుక, వృత్తి రీత్యా నేను అప్పుడప్పుడు కాన్ఫరెన్సులు, బిజినెస్ మీటింగ్‍లు, గట్రా గట్రా, వగైరా వగైరా వంటి వాటికి వెళ్ళ వలసి వచ్చినప్పుడు, చక్కగా ఒక మూల చూసుకుని, చేతిలోని ప్లేటుని దానిమీద పెట్టుకుని భొంచేస్తాను. ఇంతే కాకుండా, మా కార్యాలయంలో నా కోసం ప్రత్యేకంగా ఒక చిన్న బల్ల నేను వెళ్ళే సమయానికి సిద్దంగా ఉంటుంది.

మొన్నీ మధ్య, ఎవ్వరి బ్లాగులోనో ఒక విషయాని ప్రస్తావించడం జరిగింది. దానిని ఇక్కడ మరొక్క సారి సవినయంగా మీతో పంచుకుంటాను..

ఎలాగోలా బ్రతికేయ్యాలంటే, ఎలాగైనా బ్రతికేయ్యవచ్చు. కానీ ఇలాగే బ్రతకాలనుకున్న వాళ్ళకే కష్టాలన్నీ..

ఏమంటారు?

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

ప్రవర్తన - పరివర్తన, భావం - స్వభావం

నేను ఈ మధ్య చదివిన ఒక బ్లాగు పుటలో, సదురు స్వంతదారుడు తన అభిప్రాయాన్ని చక్కగా అందమయిన భాష్యంలో తెలియజేసినారు. ఆది ఏ బ్లాగు, ఏ విషయమది అనునటువంటి విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. అసలు విషయమల్లా.. ఆ పుటకు స్పందించిన వ్యక్తులలో నేను ఉన్నాను. నాతో పాటుగా మరొక వ్యక్తి.. ఈ క్రింది విధంగా స్పందించారు.

... టైపులో చాల పుట్టుకొచ్చాయి. chain schemes మరి డేంజర్. ఆ మధ్య *** అని ఒ లం* కొ** (naa కొ**ది hyderabad అనుకొంటా) కోట్లల్లో జనాలని ముంచాడు. ఇంకో లం* కొ** (ఆ లం* కొ**ది కూడా హైదరాబాదీ) books ని CD లోకి ఎక్కించే HOME BASED WORK అని (ఈ నా కొ** BANK EMPLOYEE). చాల మంది చాల పోగుట్టుకొన్నారు. అలాగే CHARMINAR, KRISHI ... ఈ లం* కొ**లందరికి HYDERABAD వాళ్ళు భలే దొరుకుతారు ..

కొన్ని విషయాలను ఆ బ్లాగు రచయత తీర్చిదిద్దితే బాగుండేది. కానీ ఆ బ్లాగు ప్రచురించిన రచయతకు ఈ స్పందన చదివిన తరువాత ఎటువంటి భావన కలిగినట్లు లేదు.. చక్కగా ఉన్నదున్నట్లుగా publish చెసేసారు, కొంచం కూడా moderate చెయ్యకుండా. ఇది చదివిన తరువాత, నా మనసుకు కొంచం భాధ కలిగి, సదురు స్పందించిన వ్యక్తికి విడిగా ఆయన వ్యక్తిగత మెయిల్‍కి క్రింది విధంగా ఒక విన్నపాన్ని తెలియజేసాను.

నా పేరు చక్రవర్తి, నేను మీరు స్పందించిన తీరుపై, నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి, మీకు ప్రత్యెకంగా ఉత్తరం వ్రాయుచుంటిని. మీ స్పందనకు ముందు నేను స్పందించాను, గమనించగలరు. మీ పదజాలం లోని కొన్ని అసంమజసంగా ఉన్నవి. దయచేసి, ఇక మీదట తమరు అటువంటి పదజాలం వాడరని ఆశిస్తున్నాను. మీరు ఉదహరించిన సదరు *** అనేటటువంటి వ్యకి మంచి వాడు కాదనుకుందాం, అతను చేసిన తప్పుకి అతని తల్లిని 'లం*' అని సంభోదించడం ఏ మాత్రం వివేకం .. మీకు కచ్చి ఉంటే అతనిని తిట్టండి అంతేకాని అతని తల్లి తండ్రులను అనవసరంగా అపార్దం చేసుకోవడం ఎంత మాత్రం భావ్యమో ఆలోచించగలరు.
అన్యధా మంచిగా ఆలోచిస్తారని, నన్ను + నా అభిప్రాయాన్ని తప్పుగా భావించరని ఆశిస్తూ..

దీనికి ఎంత త్వరగా బదులు వచ్చిందంటే.. బహుశా.. ఒక రెండు గంటల వ్యవధిలో ఈ క్రింది విధంగా తిరుగుటపా వచ్చింది.

నమస్కారం, మహా కవి శ్రీ శ్రీ, ఇంకా చాల మంది చాలా, చాలా పుస్తకాలలో , సినిమాలలో వాడారు. నేను కొత్తగా ఈ పదాలు వాడ లేడు- కనిపెట్టలేదు . గమనిచగలరు. SORY. నేను అటువంటి పదాలను వాడకుండా ఉండలేను.
BEST REGARDS

ఈ తిరుగు టపా చదివిన తరువాత నాకు నోటివెంట మాటలేదు. ఏమిటిది?? ఎవ్వరితో పోలిక??? మహాకవి శ్రీ శ్రీ గారు వాడారు కదా అని మనం నిరబ్యంతరంగా ఇట్లాంటి పదాలను వల్లించ వచ్చా??? మనలో ఉండవలసిన తెలివి తేటలేమయినట్లు?? మనలో ఉండవలసిన వివేకమేమయినట్లు?? పెద్దవాళ్ళు ఎదో తప్పుచేసారనుకోండి, అటువంటి తప్పు మనంకూడా తప్పకుండా, తప్పు చేయవలెనా??? కందుకూరి వీరేశలింగం పంతులుగారు వితంతువునైనా గౌరవించాలని చెప్పిన మంచికి ఎటువంటి విలువలేదా??

ఇవన్నీ ఒక ఎత్తైతే, వయస్సుతో పాటు పెరగవలసిన పెద్దరికమేమయినట్లు?? కొంచమయినా హుందాగా బ్రతకాలి అన్న ఆలోచనలేకుండా, 3rd grade people లా ప్రవర్తించిన ఇట్టి మనుషులను ఏమి చేయ్యాలో అర్దం కావడంలేదు. వీరు మంచిగా.. మర్యాదగా మారతారని నేను కలలో కూడా ఊహించలేను. వీరే ఇలా ఉంటే, వీరి ఇంట పుట్టి పెరిగిన పిల్లలు ఏవిధంగా తయారవుతారో ఊహించుకుంటే.. దేవుడా.. వారిని, వారి వారి సహచరులను నువ్వే కాపాడుమని వేడుకోవడం మినహా .. ఏమీ చెయ్యలేను. కానీ ఒక్కటి మాత్రం చెయ్యగలను.. మా తాతగారు బ్రతికున్నరోజులలో చెప్పిన మాట ఒకటి వీరిలాంటి వారికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది..

దుశ్టులు, దుర్మార్గులు,స్త్రీలను గౌరవించడం చేతకానివారు, అమర్యాదగా ప్రవర్తించే వారు.. ఇలా కొంచం పెద్ద లిస్టే ఉంది.. వీరంతా మనం విసర్జించేటటువంటి మల మూత్రాలతో సమానం. పెంట మీద రాయి వేశామనుకోండి ఏమి జరుగుతుందో తెలుసుకదా.. అటువంటప్పుడు, అట్లాంటి వారితో మనకి పనేమిటి?? దూరంగా ఉంటే పోలా.. మనకూ మంచిది.. వారికీ మంచిది.

ఏమంటారు?

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

అర్దం, పరమార్దం - అపార్దం

కొత్తపాళీగారు ఈమద్య, మీ జీవిత పరమార్దమేమిటని సూటిగా ముక్కు పగిలేటట్టు ఒక్కటిచ్చారు. ఈ విషయం మీద నా అభిప్రాయాల్ని పొందుపరిచే ముందుగా, ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

  • రాకేశ్వరరావుగారెమో.. బ్రతుకు పోరాటంలో గెలిచి, వంశాభివృద్ది చేసుకోవడమన్నారు
  • రమణిగారేమో.. మనసులోనిమాటని చల్లగా, మెల్లగా.. బ్రతికినంతకాలం ఆనందంగా జీవించేయగలగడం అన్నారు
  • నెటిజన్‍గారెమో.. తన అర్దభాగం దురమయినప్పుడు అంటూ ఎదో చెప్పారు.. నేనేమో తెలుగు వాడినాయే.. మనదా అంత అంత మాత్రం ఆంగ్ల పరిఙ్ఞానమాయే.. ఎదో అర్దం అయ్యి అవ్వనట్లుంటే.. ఎందుకయినా మంచిదని తలకెక్కించుకోలేదు.
  • దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారేమో విశాఖతీరాన కూర్చుని, ఏమి తెలియదంటూ తెలుకోవాలన్నారు. అంతేగాక, తనను తాను తగ్గించుకుంటూ, ఎదుటివారిలో మనల్ని చూసుకోవడమేకాక, కొంచం .. మరికొంచం.. ఇంకొంచం.. అనుకుంటూ మంచితనాన్ని పెంచుకోవడమే మన అందరి పరమావిధి అంటూ ముగించారు.
  • చావా కిరణ్ గారెమో.. ఇప్పుడంత అవసరమా అంటూ చురకేసారు
  • అప్పిచ్చువాడు.. అదేనండీ.. వైద్యుడు .. డా:రాములుంగారు.. (అయ్యా!! అన్యధా భావించకండి) ఇచ్చిపుచ్చుకోవడంలోనే అంతా ఉందన్నారు
  • సాలభజింకలు పేరుతో బ్లాగ్ చేసే పప్పు నాగరాజుగారేమో.. జీవితమంతా ఒక అనంతమయిన కార్పెట్ (తెలుగులో ఏమంటారో తెలియ లేదు..) లాంటిది, అది విప్పుతూ పోవడం అనేది ఒక వ్యర్ద ప్రయాస అనడమేకాక.. జీవిత పరమార్దం తెలియజేయడమంటే.. అసాద్యాయానికి కొంచం అటూ.. ఇటూ.. గా అంతేనన్నారు.
  • నాగ మురళిగారేమో.. తన గత స్మృతులు తలచుకుంటూ.. జీవితం అంటే ఒక గొప్ప అద్బుతం అంటూ.. దాని పరమార్దమేమిటో దాటవేశేశారు.
  • గార్లపాటి ప్రవీణ్‍గారు, దాదాపు సంవత్సరం క్రిందట తనకూ ఇట్లాంటి ఆలోచన వచ్చిందనీ.. ఆకాలంలో తాను ప్రచురించిన పుటనే, తన ఆత్మ శోధించే ప్రశ్నగా పేర్కొన్నారు. దానికి ఎందరో మహానుభావులు తదనుగుణంగా స్పందించారు. ఆ పుట ఆధారంగా.. ఆనాటికి, ప్రవీణ్‍గారి చిట్టాలో వారి పెండ్లి (ఆలోచన, క్షమించాలి..) లక్ష్యం లేదన్నట్లు తెలియజేసారు.. ప్రస్తుతానికి ఓ ఇంటివాడై అంతేకాకుండా సతీసమేతంగా జీవిస్తున్నాడని ఆశిద్దాం
  • బ్లాగాడించేస్తా నంటున్న రవిగారేమో.. ఇలాంటి ఆలోచనలు తనకెప్పుడొచ్చినా, జిడ్డుకృష్ణ మూర్తిగారి రచనలు చదివేస్తానంటూ.. ఏది ఏమైనా సాధారణంగా గడపడమే ఉత్తమం అన్నారు.
  • వికటకవిగా ప్రచురించే శ్రీనివాసు గారేమో తనకూ అప్పుడప్పుడు ఇలాంటి స్థితే వస్తుందనీ.. అందులో పెద్దగా పట్టించుకోవడానికి ఏమిలేదంటూనే.. ఎవ్వరో మహానుభావుడన్నట్లు.. పరోపకార్ధం మిదం శరీరం అని స్పందించారు.
  • ఓనమాలుగా ప్రచురించే లలితగారు.. జీవిత పరమార్దం జీవించడమే తప్ప మరొకటి కాదన్నారు.
  • చెరశాల రేణుకా ప్రసాద్ గారేమో మొదటగా స్పందించిన రాకేశ్వరవుగారితో ఏకీభవిస్తూనే.. తన అంతరంగంలోని మాటని, నలుగురన్నట్లుగా.., నిస్వార్ధ ప్రేమ + సుఖాన్ని (మాత్రమే) పంచుకోవడం + వగైరా.. వగైరాగా తెలియజేసారు.
  • రె లైటనింగ్ గా ప్రచురిస్తున్న కిరణ్‍కి.. అస్సలు జీవితమే ఒక పెద్ద ప్రశ్న అయితే.. దాని పరమార్దం మరో చిక్కు వీడని.. లేదా చిక్కు తియ్యలేని మరో ప్రశ్న కాబట్టి.. వేటి గురించి ఆలోచించుకుండా.. జీవితమే ఒక ఆట అనుకుంటూ ఆడేయ్యంటున్నారు.
  • గిరీష్ గారేమో కొంచం వేదాంతంగా.. ఎటువంటి ఆశలు / కోరికలు లేకుండా జీవించేయ్యడమే ఈ జీవిత పరమార్థం మంటూ .. నదులను జలాసాయాలను ఉదహరిస్తూ ఒక పుటని ప్రచురించారు
  • శ్రీనివాస్ గారికేమో జీవితాశయానికి మరియు జీవిత పరమార్థానికి తేడా అంతగా లేదంటూనే, మన ప్రమేయం లేనిది అంతేకాక తప్పకుండా ఉండి తీరాల్సినదే జీవిత పరమార్ధమని స్పందిచారు
  • గార్ల నవీన్ గారికి అనుకోకుండా గత శ్మృతులు గుర్తుకొచ్చి, ఆనాటి నుంచి తానూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరితపిస్తున్నానంటూ.. అందరిలోనూ మంచే చూస్తూ జీవించేస్తే అంతా ఆనందమయమవుతుందంటున్నారు.
  • దైవానిక గారేమో సంతృప్తిగాఅ జీవించడమే జీవితపరమార్ధం అంటున్నారు
  • సుజాతగారేమో తన మనసులోని మాటను సున్నితంగా, పరోక్షంగా... పరోపకారానికే ఓటేశెసారు

హమ్మయ్య..!! ఇప్పటికి రెండు రోజులుగా చేసిన ప్రయత్నానికి ఒక రూపం వచ్చింది. ఇక ఇప్పుడు నా వంతు.

ఒక రకంగా నేను చావా కిరణ్ గారితో ఏకీభవిస్తాను. మనకిప్పుడు ఈ విషయం అవసరమా..?!!#$%^&*.. ఎదో కడుపు నిండుగా.. ఇంటి పట్టున తిన్నగా.. ఉధ్యోగ వేళలలో చల్లగా బ్రతికేస్తున్న మనకు ఈ ఆలోచన అవసరమా??? ఈ విషయానికి సమాధానం వెతికేముందు, అస్సలు ఈ ప్రశ్న మొలకెత్తడానికు గల కారణాలు సోధిద్దాం

మొదటిది : ఇట్లాంటి ఆలోచనలు, పని లేని వేళలలో మొలకెత్తుతాయి.. ఆంగ్లంలో చెప్పినట్లు.. Idle man's brain is devil's workshop. ఎదో పనిలో పడ్డామనుకోండి, ఇలాంటి విషయాల వైపు అస్సలు దృష్టి సారించము.

రెండవది : పొట్ట కూటి కోసం రోజంతా కష్ట పడే కూలీలు ఇలాంటివి ఆలోచించరు, ఎందుకంటే.. పగలంతా పనిచేసిన మీదట, రెండు సారా చుక్కలు గొంతులోకి దిగిన తరువాత ఒళ్ళు నెప్పులు కాస్తా మత్తులో లెక్కచెయ్యరు. తదుపరి, కడుపు నిండా కలో.. గంజో.. కంటి నిండా నిద్ర.. ఇలా పనిచేసుకుంటూ, బ్రతకడానికే సమయం లేనివాడు ఇలాంటి ఆలోచనలు చెయ్యడు. ఇలాంటి ఆలోచనలు... "నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా .. " అంటూ పాడుకునే మధ్య తరగతి వాళ్ళకు తప్ప మరింకెవరికీ రావని మనం గుర్తించాలి.

మూడవది : ఆత్మావలోకనం చేసుకునే చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి వాటి గురించి ఆలోచించాలని అనిపిస్తుందనడంలో ఏమత్రం అతిశయోక్తి లేదు.. ఇలాంటి వారు పేద, మధ్య , ధనికులే కానక్కరలేదు. స్వయం ప్రత్తిపత్తి కలిగి, కరిగి పోయే కాలాన్ని ఏవిధంగా వినియోగించు కోవాలనే తాపత్రయం కలిగిన వాళందరూ ఈ వ్యాధిఘ్రస్తులే..

ఈ ప్రశ్న సమాధానికోస్తే.. ఏనాడో, ఒక మహానుభావుడన్నట్లు.. మానవసేవయే మాధవ సేవగా భావించుకుంటూ.. పరోపకారం మిదం శరీరం అని భావించడమే కాకుండా, ఉన్నంతలో (వీలు) కలిగి నంత పంచుకుంటూ పోవడమే అని తెలుసు కోగలరు. ఇక్కడ మరొక విషయం తనకు మాలినది ధర్మం పనికిరాదని కూడా మర్చిపోరాదు.

ఇంతే సంగతులు..

భారతావనికి వన్నె తెచ్చిన మహానుభావులు : భాగం-౧

పాత e-ఉత్తరాలు తిరగేస్తుంటే, ఒక ఉత్తరం నా కంటికి ఇంపుగా కనబడగానే.. తెలుగులోకి తర్జుమా చేసి మీ అందరికి అనువుగా ఉంటుందని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో తప్పొప్పులుంటే, మన్నించగలరు. మూల పుస్తకాన్ని ఈ లింకు నుంచి పొందగలరు. ఎందరో మహానుభావులు, వారిలో కొందరు వీరు..

ఆర్యభట్ట (౪౭౬ - 476 CE) - ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మెదటి వ్యక్తి

clip_image001

ప్రస్తుత బీహారులోని పాట్నలో క్రీ.పూ. ౪౭౬ (476 AD) జన్మించిన ఈ ఆచార్యుడు, భూమి గుండ్రంగా ఉందని, అది తన అక్షం చుట్టు తాను తిరుగుతోందని.. మెట్ట మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి. అంతేకాకుండా, సంఖ్యాక శాస్త్రంలో పై (Image:Pi-symbol.svg) విలువను దగ్గర దగ్గరగా సూచించిన మొదట వ్యక్తికూడా వీరే. వీటన్నింటినీ మించి, సున్నాకు ఒక విలువ గలదనీ, అట్టి సున్నకు విలువ కట్టడం అసాధ్యమనీ, ఈ ఆచార్యుని ప్రతిపాదనే ఈయన ఉనికిని చాటుతుంది. ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో మచ్చుకు కొన్ని..

  • భూమి చుట్టుకొలతను ౨౪౮౩౫ (24835) మైళ్ళుగా ప్రతిపాదించారు, అది ఈనాటి లెక్కకు చాలాదగ్గర. ప్రస్తుత లెక్కల ప్రకారం భూచుట్టు కొలత ౨౪౯౦౦ (24900) మైళ్ళు
  • గ్రహాణాలు వాటి వివరణ
  • సంఖ్యాశాస్త్రం.. ఎన్నో.. మరెన్నో..

రెండవ భాస్కరాచార్య (౧౧౧౪ - 1114 CE) - బీజగణితానికు ఆద్యులు

clip_image001[4]

ప్రస్తుత మహారాష్ట్రలోని జలగావు జిల్లాలో జన్మించిన ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో అతి ముఖ్యమయినవి, లీలావతీ మరియు బీజ గణితం. భూమికి గురుత్వాకర్షణశక్తి ఉంటుందని తెలియ జేసిన న్యూటన్‍కు ముందుగానే, సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందటనే భూమికి గురుత్వాకర్షకశక్తి ఉంటుందని, సూర్య సిద్ధాంతంగా ప్రతిపాదించినారు.

కానడ మహర్షి - ఆణుసిద్ధాంత కర్త

clip_image001[6]

ప్రస్తుత గుజరాత్ లోని ద్వారక లో జన్మించినట్లు వీరి అభిప్రాయం. అణు సిద్దాంతంలో జాన్ డాల్టన్ ప్రతిపాదించిన అణువులు, పరమాణువులు వంటి ఎన్నో విషయాలను వీరు, జాన్ డాల్టన్ కన్నా సుమారు రేండువేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రతిపాదించినారు. అణువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో వాటిల్లో రసాయనక చర్యలు ప్రతి చర్యలు ఎలా జరుగుతాయో వీరు తమ గ్రంధాలలో తెలియ జేసారు అన్నవాటికి సాక్ష్యాలు కోకొల్లలు.

నాగార్జున మహర్షి

clip_image001[8]

రసాయన శాస్త్రానికి పితమహునిగా పేరుగాంచిన వీరు, మధ్యప్రదేశ్ నందుగల బలుకా గ్రామమునందు జన్మించారు. రసాయన శాస్త్రం మరియు మూలకాశాస్త్రం లలో వీరి ౧౨ (12) సంవత్సరాలు చేసిన కృషి ఫలితమే, రస రత్నాకరం, రసృదయ మరియు రసేంద్ర మంగళం వంటి గ్రంధాలు. ఆరోగ్య మంజరి మరియు యోగాసర్ వంటి గ్రంధాలు కూడా వీరి ఙాన గుళికలే. ఆనాటి విస్వవిద్యాలయయిన "నలందా విస్వవిధ్యాలయం"లో వీరు గురుతుల్యులు.

 

మరిన్ని రేపటి పుటలో.. అంతవరకూ చదువుతూ మీ మీ స్పందనలు తెలియజేయగలరు.

నాతెలుగు తల్లికి (వాడిన) మల్లెపూదండ

నేను ప్రస్తుతం ఉంటున్నది మన రాష్ట్రరాజధాని, హైదరాబాదులో. మన రాష్ట్ర భాష తెలుగు. అట్టి తెలుగుకి ఎంత దుస్తితి పట్టిందో ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

భాషాప్రయుక్త భావనపై వేరు పడి, తెలుగును ఒక వెలుగు తెచ్చిన వారందరూ ఈనాటి మన హైదరాబాదు నగర స్ంచారానికి వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చి నేనింకా ఎందుకు బ్రతికి ఉన్నానని భావించి.. మన హైదరాబాదు జనాల్ని పుట్టించిన ఆ బ్రహ్మ దేవుడు కూడా మార్చలేడని తెలుకుని, మీళ మధ్య బ్రతకడం కన్నా చావడమే మేలనుకుంటారు.

నండూరి సుబ్బారావు గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, మల్లంపల్లి సోమసేఖర శర్మ గారు, కొంపల్లి జనార్దన రావు గారు, ఆధునిక తెలుగు పితామహుడిగా పేరుగాంచిన గురజాడ వేంకట అప్పారావు గారు, పైన చెప్పిన వారికి ఏమాత్రం తీసిపోని శ్రీరంగం శ్రీనివాసరావు గారు, వీరందరినీ మించిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, కవికొండల వెంకట రావు గారు, చింతా దీక్షితులు గారు అబ్బురి రామకృష్ణ రావు గారు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణగారు .. ఎందరో మరెందరో మహానుభావులు కనుకా ఈరోజుల్లోని పిల్లలని చూసి ఉంటే.. మనభాషకి పట్టిన గతికి చింతించడమే కాక, తాము పడ్డ కష్టానికి.. చేసిన కృషికి లభిస్తున్న ఆదరణకి ఎంత భాధ పడేవారో ఒక్క సారి ఊహించుకోండి.

అస్సలు ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా?? నిన్నటి సాక్షి పత్రికలో చదివిన వ్యాసం కిక్కు ఇవ్వాళ్టికి నషాళానికి ఎక్కింది. ఈ మధ్య మన ప్రస్తుత అధికార ప్రబుత్వం చిన్నపిల్లలకు ఒకటవ తరగతి నుంచి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతోందట. పిల్లలకి చిన్నవయస్సు నుంచే తెలుగుని దూరం చేస్తే.. వారికి మన మాత్రు భాషపై మమకారం ఎలా పెరుగుతుంది? అభం శుభం తెలియని పిల్లలు.. అందునా పసి మొగ్గలు.. వాళ్ళు, వాళకేం తెలుస్తుంది ఏ భాష నేర్చుకోవాలి అని??? అన్నెం పుణ్యం తెలిసిన మన భుద్దికేం అయ్యింది?? ఎదో పెద్దయిన తరువాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి కాబట్టి ఇప్పటినుంచే పెద్ద పెద్ద పాఠశాలలో చిన్న చిన్న చదువులు చదివించేస్తే సరిపోతుందని అలోచిస్తున్న నేటి తల్లి తండ్రులు తప్పు చేస్తున్నారా.. లేక వాళని చూసుకుని వారు వేసే ఓట్లకోసం ఈ ప్రభుత్వం ఇంతకు బరి తెగించిందా??

ఏదైనా భాషపై పట్టు రావాలంటే మూడు మాధ్యమాల ద్వారా మాత్రమే కుదురుతుంది. అవి, మాట్లాడగలగడం మెదటిదైతే.. చదవగలగడం రెండవ దస. ఆఖరున వ్రాయగలగడం. మాట్లాడడానికైతే ఇంట్లో తల్లి తండ్రులు.. స్నేహితులు, పరిచయస్తులు.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ తెలుగుని చదవడానికి మరియు వ్రాయడానికి ఉన్న ఒకె ఒక్క అవకాశం .. పాఠశాల మాత్రమే. అట్టి పాఠశాలలోనే మనం తెలుగుని విస్మరిస్తున్నామంటే... ఇక పిల్లలకు తెలుగుదనం యొక్క ఉనికి ఒక్క మాటలకి మాత్రమే మిగిలిపోతుంది. ఈ రోజుల్లోని తల్లి తండ్రులు తమ తమ పిల్లల్ని చక్కగా.. అమ్మా .. నానగారు .. అనేటటువంటి పిలుపులకు దూరంచేసి.. మమ్మీ డాడి వంటి అరువు తెచ్చుకున్న పిలుపులకు దగ్గర చేస్తున్న వైనం ఏమాత్రం హర్షణీయం??

ఇవన్నీ ఒక ఎత్తైతే.. మన రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న టికెట్ కండక్టర్లకు ఎంతమందికి తెలుగు వచ్చో ఎప్పుడైనా మాట్లాడి చూసారా?? అప్పుడప్పుడు మేము విజయవాడనుంచి వచ్చేటప్పుడు తెల్లవారుఝాము వేళలో బాగుంటుంది కదా అని బస్సు ప్రయాణం చేస్తూ ఉంటాము. నాకు ఆశ్చర్యం వేసే విషయమేమిటంటే.. వాళు అనేటటు వంటి మొట్ట మొదటి మాట.. కహా జానెకా.. (హిందిలో, ఎక్కడికి వెళాలి?). ఒకటి రెండుసార్లు భాషపై ఉన్న మమకారం చంపుకోలేక, వాళు మారరని తెలిసీ నావంతు కృషిగా వారితో మాట మాట కలిపి,వారికి అస్సలు తెలుగు వచ్చో.. రాదో.. తెలుసుకునే ప్రయత్నంలో, వాళకి తెలుగు తెలుసు అన్న చేదు నిజం తెలిసిన తరువాత నాగొంతుక మూగబోతుంది. కొంత మందైతే, తెలుగు తెలిసినా రానట్లు నటించడం చూస్తుంటే, వాళను ఏమి చెయ్యలేని నా నిస్సహాతకు నామీద నాకే అసహ్యమేస్తుంది. మరి కొందరైతే మరో అడుగు ముందుకేసి, హమ్ కో తెలుగు నహి అతాహై.. తుమ్ హిందీ మే బోల్.. అంటూ తిరిగి, రివర్స్‍లో నన్నే గదమాయిస్తూంటారు. మన ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తే, ఇట్లాంటి వాళు అలాంటి ఉద్యోగాలు చెసేవారా??? ఏమి చేస్తాం.. ఏమీ చెయ్యలేం.. చూస్తూ కూర్చోవటం తప్ప. దేవుడా.. నా తెలుగు తల్లిని రక్షించు.

ఎల్‍వీ ప్రసాద్ గారిపై నా అభిప్రాయం

మెదటి విషయం.. ముఖ్యంగా.. నేను తెలుగు సినిమాలు చాలా తక్కువగా చూస్తాను.. తక్కువగా అనేకన్నా, అరుదుగా అంటే బాగుంటుందేమో.. ఏది ఏమైనా.. ఇక్కడ నేను ప్రస్తావించే విషయాలు పూర్తిగా నాస్వగతం.

రెండవది.. ఇన్నాళ్ళు, ఎల్‍వీ ప్రసాద్ గారంటే.. ఒక నేత్ర చికిత్సాలయం యొక్క స్వంతదారుడిగానో లెక హక్కుదారుడుగా మాత్రమే అనుకునేవాణ్ణి.. నేనింత వరకూ ఈ మహానుభావుడు ఎదో పెద్ద వైద్యుడై ఉండి ఉంటాడు.. అనుభవంతో వచ్చిన ఙ్ఞానాన్ని, తనకు వీలున్నంతలో సాధారణ ప్రజానీకానికి తనవంతు కర్తవ్యంగా తనకు కలిగినంత సేవ చేస్తున్నాడు అనుక్కున్నా.. తీరా ఈరోజు, నవతరంగంలో ఈయన మీద ప్రచురితమయిన వ్యాసాన్ని ఆసాంతం చదివిన తరువాత అస్సలు కధ ఏమిటో తెలిసింది.

ఇక ఆ వ్యాసాన్ని చదివిన తరువాత, ఎల్‍వి ప్రసాద్ గారిపై ఉన్న గౌరవం కాస్తా మంటలో కలిసింది. పాతరోజుల్లో చెప్పినట్లు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.. తన కుటుంబం అప్పుల పాలై.. తండ్రి మరణించి.. అభం శుభం తెలియని మేనమామ కూతురు, ఊహ తెలియని వయస్సులో .. వచ్చీ రానీ వయస్సులో .. తెలిసీ తెలియని పెళ్ళి చేసుకుని .. త్వరలోనే పిల్లకి తల్లై .. పరిపక్వతలేని స్తితిలో ఉన్నపుడు.. ఈయనగారు, తల్లిని.. కట్టుకున్న ఆలిని.. కడుపున పుట్టిన పిల్లనూ వదిలి .. ఏదో సాధిద్దామని, ఇంట్లో ఎవ్వరికి చెప్పాపెట్ట కుండా బొంబాయి చెక్కేస్తారా.. కనీసం చుట్టూ ఉన్న సమాజం తల్లిని గానీ, కట్టుకున ఆలిని గానీ.. "ఏమ్మా మీ అబ్బయి కనబడటం లేదు.. మీ ఆయన ఊళ్ళో ఉన్నాడా!! " వంటి ప్రశ్నలు వేస్తే, ఏమి సమాధానం చెబుతారో అన్న ఆలోచన లేకుండా.. అందరిని గాలికొదిలేసి.. భాధ్యతలకు దూరంగా "బొంబాయి పారిపోయాడు..", అని చదివిన తరువాత, మనసుకి చాలా కష్టం కలిగింది. ఇంతే కాకుండా.. ఈయనగారికి చదువుమీద ఏమాత్రం శ్రద్ద లేదంట. మన పిల్లలు చదువు విషయంలో శ్రద్ద వహించక పోతేనే మనం సహించమే.. అట్లాంటిది, ఇంత పెద్దాయనకి మాత్రం "శ్రద్ద లేదు" అని తెలుసుకున్నా మనమేం పట్టించుకోం. పైగా, ఈయన ఇంత పోడిచాడు.. అంత పీకాడు.. అంటూ ప్రసంగాలిస్తూంటాం.. చ చ.. తల్లిని, పెళ్ళాన్ని అంతేకాక కన్న కూతురిని కష్టాలో ఉన్నప్పుడు గాలికొదిలేసి, తన స్వంత ప్రయొజనాలకే విలువనిచ్చే వ్యక్తీ ఒక వ్వక్తేనా.. ఇదేమయినా స్వాతంత్ర్య పోరాటమా.. దేశం కోశం, త్యాగం చేసాను అని సర్ది చెప్పు కోవడానికి .. పూర్తిగా వ్యక్తిగత అభిరుచి..

నిజ్జంగా చెప్పాలంటే.. ఆ ఇద్దరు స్త్రీ మూర్తులకు చేయెత్తి నమస్కరించవచ్చు. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు, తల్లి పడే భాధ వర్ణనాతీతం.. అటువంటి సమయంలో ప్రతీ స్త్రీ, కట్టుకున్న భర్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అటువంటి సమయంలో ముఖం చాటువేసినా, తిరిగి వస్తున్నానని టెలిగ్రాం వచ్చినప్పుడు, కూతురు చనిపోయిందనే విషయాన్ని ఈయనకు ఎలా తెలియ జేయాలా అని వారిద్దరు పడ్డ భాధ గురించి చదివినప్పుడు.. ఆ పుణ్య మూర్తులకు సాష్టాంగ పడాలనిపించింది. బ్రతికి ఉన్నాడో లేడో అనేటి సంసయావస్తలో ఉన్న తల్లికి కొడుకు వస్తున్నాడు అన్న విషయం పోయే ప్రాణం లేచొచ్చేటటు వంటి వార్తే.. కానీ, సుమారు రెండు సంవత్సరాలు ఆమె అనుభవించిన సందిగ్దావస్త ఏ తల్లికీ రాకూడదు అని నేను భావిస్తున్నాను. ఇంత మందిని ఇబ్బంది పెట్టి సాధించింది ఏమిటి..

ఒప్పుకుంటాను.. అటువంటి మహానుభావుడే లేకపోతే.. ఎన్నో మంచి మనోరంజక మయిన చిత్రాలు రాకపోయేవి అంటారు.. ఎవ్వరికి కావాలండీ ఇవన్నీ.. మేమేమయినా అడిగామా.. తన స్వంత ప్రయోజనాలకు, ధన సంపాదనకు మాత్రమే చేసారా లేదా?? ఫలాపేక్షణ కోసంచేసి, పెద్ద.. ఎదో.. సమాజాన్ని ఉద్దరించామంటారేమిటి?? ఒక వ్యక్తిత్వం అంటూ లేని వ్యక్తి.. దానికి తోడు లాభాపేక్షణ .. వీటన్నింటినీ మించి.. పులితోలు కప్పి.. మహానుభావుడు అనేటటువంటి పెద్ద పదాలు .. ఏమిచేస్తాం .. సమస్య మనలోనే ఉంది.. మనం ఇంకొకళ్ళను అనుకునేం లాభం.. ఈ సినిమా వాళ్ళంతా ఇంతే..

అదేదో సినిమాలో హీరోయిన్, నటించే చాన్సు కోసం పడుపు వృత్తికి కూడా వెనుకాడదు .. మళ్ళీ తను చేసేది తప్పుకాదన్నట్లు / సరైనట్లు డైలాగు .. "ఒక్క ఛాన్సు.. ఒకే ఒక్క ఛాన్సు ..", వీళందరినీ పెద్ద స్టార్‍లుగా మనం గుర్తించేయ్యడం. మనం గుర్తింస్తున్నాం కదా అని వాళ్ళు కనీస విలువలను గంగలో తుక్కి, మానవతా విలువలకు తిలోదకాలిచ్చి ఇదిగో ఇలా గొప్ప వాళై పోతారు. మన నవతరం ఇలాంటి వాళని తమ తమ గాడ్ ఫాదర్‍గా అనేసుకుని, ఇంకే .. ఇంకేముంది, నేను కూడా అంత వాడినై పోతాను అని ఒక తాడు బొంగరం లాగా తిరిగేస్తూ ఉంటారు.

ఇక్కడ, ఇప్పుడు మరొక ప్రస్తుత పెద్ద నటుడు విషయం తలవని తలంపుగా మదిలోకొచ్చింది. పేరు అప్రస్తుతం.. కానీ విషయం చాలా సున్నితం. ఈ పెద్ద హీరో గారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బయి. పెద్ద పిల్ల వివాహం ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఒకరితో నిత్సయ తాంబూలాలు తెగతెంపులు.. వేరొకరితో వివాహం. చిన్నకూతురు, అస్సలు చెప్పాపెట్టాకుండా పారిపోయి వివాహం. ఆరోజుల్లో.. చిన్న కూతురు వివాహం పెద్ద వార్తా విషయం. అట్టి మన ప్రభుద్దుడు, ప్రస్తుతం మన రాజకీయాల్లోకి అడుగుడతాడు అనే ఊహాగానాలకు చిలువలు పలువలుగా ఎవ్వరికిష్టమొచ్చినట్లు వారు తమ తమ స్టేట్‍మెంట్ల్.. ఇంట్లో పిల్లలు ఏమి చేస్తున్నారో .. వాళ్ళ అభిరుచులేమిటో .. వాళ్ళను అదుపులో పెట్టలేక విఫలమయినటు వంటి వ్యక్తి.. రాజకీయాల్లోకి రావడమేమిటో.. మనమందరం కలసి, ఆయనకు ఓట్లు వేసి ఆయన్ను మనల్ని పాలించే అధికారం కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనేమిటో.. వీటన్నింటికి మనం గొర్రెల్లాగా .. తానా అంటే తానె తందానా అనడం ఏమిటో.. నాకయితే అర్దం కావటం లేదు ..

ఇక ముగించేముందు, తేలిందేమిటంటే.. సినిమావాళందరూ ఇంతే.. స్వప్రయోజనలే తప్ప పరోపకారం ఏమాత్రం లేనివారు అని... వీళందరినీ చూస్తుంటే.. పర భాష వాడైనా .. షారుక్ ఖాన్ .. అదేదో కార్యక్రమంలో నిఖచ్చితంగా అన్నాడట.. నేను చేసేది అచ్చంగా వ్యాపారం .. నేను రాజకీయాలలోకి పనికిరాను అని. తెలివయిన వాడు అనిపించింది. నిజాన్ని నిజంగా ఒప్పుకోవడానికి ధైర్యంకావాలి.

గాజులకు వేళాయరా

అమ్మ పిల్లలకందరికి గాజులు కొనుక్కొచ్చి స్వయంగా వేస్తుంటే తీసినది. నిన్నటి పుటలో చెప్పినట్లు.. ముగ్గురు పిల్లలకి గాజులు కొన్నుకొచ్చింది, అమ్మ. ఇంకే.. భోజనాలు అయ్యిన తరువాత పిల్లలిద్దరికి దగ్గరుండి తనే స్వయంగా వాళకు గాజులేస్తుంటే, చెప్పా పెట్టకుండా.. ఫోటో తీసేసాను..

పాతరోజుల్లో అయితే గాజులబ్బి వచ్చేవాడు.. ఈరోజుల్లో వాళెక్కడా కనబడటం లేదు కదా.. నా ఉద్దేశం హైదరాబాదు వంటి ఊళ్ళల్లో అని .. విజయవాడ లాంటి ప్రదేశాల్లో బహుశా కనిపిస్తారెమో.. మరి మీ ఊళ్ళో పరిస్తితి ఏమిటో???
అస్సలు ఇంతకీ మీకు ఈ చిత్రంలో గాజులు కనబడ్డాయా?? లేకపోతే ఒక్కసారి ఈ చిత్రం మీద ఎలుక ఎడమ బొత్తంని ఒత్తి చూడండి..
ఏమిటి .. ఎలుక .. ఎడమ బొత్తం .. ఒత్తడం.. అర్దం కాలేదు కదా..
అర్దం అయితే ఫరవాలేదు.. కాకపోతే..
మౌసు లెఫ్టు బటన్ ని ఈ ఫొటో పైన క్లిక్ చెయ్యమని దానర్దం ..
కొంచం తికమక పెట్టినట్లు ఉంది కదూ.. నాకూ అలాగే ఉంది... ఇప్పుడు కాదు .. ఆ వాక్యాన్ని ఆలోచించినప్పుడు .. కొంచం వింతగా ఉంటుందని అలా వాడేశాను.. ఎలా ఉంది నా ఈ ప్రయోగం ??
మొహమాట పడకుండా.. నిజం చెప్పండి..

పులిహొర

మామిడికాయని చెక్కి(అదే తురిమి) పులిహొర చేస్తే, ఇలాగే ఉంటుంది. ముందు చెప్పినవన్నీ ఒక ఎత్తైతే .. పులిహోర ఒక్కటే ఒక్క ఎత్తు. మా ఇళ్ళల్లో చేసే పులిహోరలో తప్పనిసరిగా పచ్చిమిరపకాయలు మరియు ఎండు మిరపకాయలు ఉండాల్సిందే. వాటిల్ని పులిహోరతో పాటుగా తింటూ ఉంటే అస్సలు కారమే అనిపించదు.

మా ఇంట్లో అందరికి పులిహోరతో తప్పనిసరిగా ఇవి తినే అలవాటు, ఒక్క శ్రీమతికి తప్ప. మీరెప్పుడైనా పచ్చిమిరపకాయ కారంలేకుండా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అనుకున్నదే తడవుగా, మా ఇంటికి వచ్చేయండి..

ఎదో చెప్పానుకదా అని చెప్పాపెట్టకుండా వచ్చేయ్యకండి, మొహమాటానికయినా ఒక్క చిన్న కబురు.. అదేననండీ.. పాతరోజుల్లో అంటూటారే.. కాకితో కబురు చెయ్యమన్నట్లు .. మీరు కాకితో కబురు పంపకండి.. ఎందుకంటే, నాకు కాకి బాష రాదు కదా.. అందుకని .. వీలయితే ఒక ఈపత్రమో, లేక దూరవాణి యంత్రముద్వరానో తెలియజేయగలరు. మేముకూడా సిద్దంచేసుకోవాలికదా..

ఏమంటారు?? ఎప్పుడొస్తున్నారు??

పులుసు-కేసరి-పప్పు

ముక్కల పులుసు, కేసరిలతో మామిడి కాయ పప్పు. ఈమద్య నాకు కూరగాయల మీద కొంచం శ్రద్ద ఎక్కువయింది. అందుకనే కూరగాయలు ఎక్కువగా లాగించేస్తున్నాను. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరినీ తినమని ఒకటే పోరు.

అస్సలు ఈ విషయం ప్రక్కన పెడితే.. పులుసు పెట్టాలంటే.. మా అమ్మే.. అందునా ముక్కల పులుసు.. ఏమిటండోయి.. ముక్కల పులుసు అనగానే.. చికెను, మటను ముక్కలనుకున్నారా.. మేము పూర్తిగా శాఖాహారులం. కాబట్టి, ముక్కల పులుసు అనగానే పులుసులో వేసే కాయగూరల ముక్కలు అన్నమాట.. ఏమిటండి.. నిరుత్సాహ పరిచాననుకుంటున్నారా.. తప్పదు సార్.. యావత్ ప్రపంచమే.. శాఖాహారం భుజించండి అని ఇల్లెక్కిన కోడిలా కూస్తూఉంటే, మీరు మాత్రం మాంశాహారం భుజించడం ఏమాత్రం బాగాలేదండి.. ఒక్క సారి ఆలోచించి చూడండి.

ఇక తీపి పద్దార్ద విషయాని కొస్తే.. కేసరి.. అమ్మ చెయ్యాలి మేము తినాలి.. అహా .. ఎంతబాగా చేస్తుందంటే......... ఈ విషయం చెప్పడం కన్నా .. ఏమేసి చేస్తుందో చెబితేసరి.. చక్కగా నెయ్యి వేసి.. నిండుగా గుండు జీడిపప్పేసి.. ఎర్రగా వేయించిన కిస్‍మిస్‍లు దట్టించి.. వడ్డించందంటేనా.. నా సామి రంగా.. కేకనుకోండి..

వీటన్నింటికీ ముందిగా నేనున్నానంటూ.. మామిడికాయ పప్పు.. కొంచం నెయ్యి వేసుకుని.. కొంచం ఆవకాయ కారం నంచుకుంటూ తింటూ ఉంటే.. అహా.. ఏమి హాయిలే హరా ఆఆఆఆ .. అన్నట్లు ఉంటుంది.. ఇంక చాలు

పచ్చడి-కూర

వంకాయ కూర మరియు దోసకాయ పచ్చడి. దోశకాయ పచ్చడి అంటే గుర్తుకొచ్చే కొన్ని మధుర శృతులలో మెదటి ఙ్జాపకాన్ని మీతో ఇక్కడ పంచుకుంటాను..

మా పెళైంది ౨౦౦౬ ఆగస్టు ౧౭వ తారీకున, (17/Aug/2006). కానీ పలు కారణాల వల్ల మాకాపురం అక్టోబర్ ౨ వతారికు (2nd Oct 2006) కుదరలేదు. ఇక మాకాపురం మెదలయిన తరువాత కొద్ది రోజులకు మా ఇంట్లో శ్రీమతి ఒక్కతే వంటా వార్పు అన్నీ అనుకోండి. ఆరోజులో ఎదో కొద్దిగా నేను తనకు సహాయం చేసేవాడినన్నమాట. అదిగో అలాంటి రోజుల్లో అలవాటయిన మొట్టమొదటి పని పచ్చడి చెయ్యటం. అందునా దోశకాయ పచ్చడి. ప్రతీ ఆదివారం ఉదయం మేమిద్దరం రైతు బజారు కెళ్ళి కూరగాయలు కొన్నుకొచ్చేవాళ్ళం. ఏ కూరగాయలు కొన్నా కొనక పోయినా దోశకాయ మాత్రం తప్పనిసరిగా కొనేవాళ్ళం. ఇప్పుడు దోశకాయ పచ్చడి చెయ్యడంలో శ్రీమతికన్నా నాచెయ్యే బాగా తిరుగిందని చెప్పుకోవచ్చు.

కానీ పండుగనాడు మాత్రం, అమ్మ నన్ను చెయ్యనివ్వలేదు.

చిల్లు గారెలు

ఘుమ ఘుమ లాడే చిల్లు గారెలు.. పండుగనాటి ప్రత్యెక తినుబండారం. గారెలు చెయ్యాలంటే మా అమ్మే.. ఈ మద్య మా ఇంట్లో గారెలు కొంచం సాధారణంగా అను నిత్యం తయారు చేస్తోంది నా అర్దాంగి.

చేసి చేసి.. అదేదో పద్యంలోని పంక్తిలో చెప్పినట్టు..

అనగ అనగ రాగ మదిసయల్లు చుండు,
తినగ తినగ వేము తియ్యనుండు,
సాధనమున పనులు సమకూరు ధరలోన,
విశ్వధా అభిరామ వినురవేమ..

చెయ్యగా చెయ్యగా .. శ్రీమతికూడా గారెలు బాగానే చేస్తోంది. ఈ మద్య్హ గారెలు చక్కగా గుల్లగా తినబుల్‍గా చేస్తోంది. ఎటొచ్చి, ఇంతకు ముందు పుటలో చెప్పినట్లుగా, అర్దాంగితో వచ్చిన చిక్కల్లా ప్రయత్నలోపమే.. ఒక్కసారి మెదలు పెట్టిందంటే.. అస్సలు ఆగదు.. తనకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్దంకావటంలేదంతే.

ఉగాది నాటి ప్రసాదం


Prasaadam1
Originally uploaded by Damaraju
పానకం, వడపప్పు, చలివిడి, కొబ్బరి, దానిమ్మకాయ, చెరకు, అరటి, కమలాలు, ఆపిల్ మరియు సపోటా.. మీకు సపోటా కనబడిందా??

ఇక్కడ ఒక విషయం యాదృస్చికంగా మదిలో మెదిలింది. ముందురోజు సాయంత్రం అమీర్‍పెట వెళ్ళినప్పుడు, చెరుకు గడ తీసుకురావడం మర్చిపోవద్దని అమ్మ మరీ మరీ చెప్పింది. సరే కదా చెరుకురసం బళ్ళు చాలావున్నాయి కదా ఎవ్వరిని అడిగినా ఇస్తారు అన్న ధీమాతో, సరే అని అభయమిచ్చేసాను. తీరా అమీర్‍పేట వెళ్ళిన తరువాత ప్రతీ చెరుకురసం బండివాడు ఒక చెరుకుగడ అడిగితే, ఒక్కొక్కటి పదిహేను రూపాయలు చెబుతున్నాడు. అదే చెరకుగడ కనుక రసంతీసి ఇస్తే ఐదు రూపాయలు మాత్రమే.. ఎంత తేడా..

ధైర్యంచేసి, అర్దాంగి పదిరూపాయలకు బేరంచేసి తీసుకుంది. దానిలోని ఒక ముక్కే మీరు ఇక్కడ చూస్తున్నది.

శ్రీ సర్వధారి నామ సంవత్సర ఆరంభ రోజు - మా ఇల్లు - ౧

మా ఇల్లు ఈ రోజు భందువులతో కళ కళ లాడుతోంది. నిన్న రాత్రి, నాకు పిల్లనిచ్చిన అత్తగారు, నాసతి అక్కగారు, వారి పుత్రికారత్నం, మా అన్నగారు, వారి ధర్మ పత్ని, వారి ఇద్దరు పిల్లలు.. మొత్తం వెరశి (మేము ఇద్దరం, ముగ్గురు భార్య వైపువారు, నలుగురు మా అన్నయ్య కుటుంబం.. అందరితో కలసి మా అమ్మ) పది మంది అయ్యారు.

పండుగనాడు.. అందునా ఉగాదినాడు..








PoojaPlaceమా ఇంట్లోని పూజ స్తలం. నిన్న అమ్మ నన్ను సాధించి, చార్మినార్ దగ్గరలోని కొట్లు అన్ని తిరిగి కొన్న white metal తొ తయారు చేసిన పీఠం ఇందులో చూడవచ్చు.

అత్తా కోడళ్ళు ఇద్దరికి కస్తంత ఆటవిడుపుగా ఉంటుంది కదా అని, నేను వాళ్ళిద్దరిని వెళమంటే.. మా అమ్మ పంతం పట్టి, నేను తీసుకు వెళితేనే కొన్నుక్కుంటాను అని భీషించుక్కూర్చున్న తరువాత, తప్పని సరై నేనే దగ్గరుండి తీసుకు వెళ్ళాను.

తీరా చార్మినార్ కు వెళిన తరువాత ఏమేమి కొన్నామంటే..
మోదటగా దేవుళ్ళకు పీఠం, తరువాత ఆ ప్రక్కనే ఉన్న బట్టల దుకాణం నుంచి ఒక చీర, స్వాతి (అర్దాంగి) వాళ్ళ అక్క కూతురుకి ఒక గాంగ్రా చోళి .. వస్తూ వస్తు ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకు గాజులు.. పనిలో పనిగా పండ్లు, ఫలాలు.. దానిమ్మకాయలు, కమలాలు, సపోటాలు, ఆపిల్స్ .. కోంటూ.. పాత శబరి లాగా, కొంచం కొంచం రుచి చూస్తూ పెద్ద సంచి నింపేసింది. ఇంతలో నేను బండి తీసి బయలుదేరిన తరువాత కొంత దూరం వెళ్ళగానే.. తువ్వాళ్లు అమ్మేవాడు కనబడగానే ఇంట్లో ఉన్న౨ కుర్చీల పైన మెత్తటి గుడ్దలు లేవ్వన్న విషయం గుర్తుకొచ్చి, ఒ రెండు కొనేసింది.. ఇంతలో ఆత్మారాముడు ఘోషిస్తూంటే.. తిన్నగా ఇంటికి చేరుకున్నాము. ఈ కధంతా ఉగాది రోజునకు ముందటినాడు. ఇక ఉగాది వేడుకలకొస్తే.. పూజ స్తలం చూసారు కదా.. ఇక ప్రసాదం .. అలాగే తిండి పదార్దాల విషయానికి వద్దాం .. ఇప్పటికే చాలా సేపు అయ్యింది.. తిరిగి రేపు కొనసాగిద్దాం .. తిరిగి కలుసుకునేంతవరకూ .. ఇంతే సంగతులు

మరో మలుపు

ఇవ్వాళ అమ్మకూడా బ్లాగు అంటె ఎమిటి.. దాని వలన ఉన్న లాభాలు ఎమిటి.. మన అభిప్రాయాలు నలుగురితో ఎలా పంచుకోవచ్చు.. వంటి ఎన్నో విషయాలు చర్చించిన తరువాత దగ్గరుండి నాబ్లాగులో ఒక పుటని దగ్గరుండి తనతో టైపు చేయించాను..

ఈ ప్రవాశనం అంతా చూస్తూంటే.. మా ఇంట్లొని స్త్రీ శక్తి అంతా ఒకేసారి నిద్రలేచినట్లైంది. వీళంతా కలసి నన్ను బయటకు నెట్టేసేటట్టున్నారు.. ఏమి సేతురా లింగా.. ఏమి సేతురా..
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

నా పరిచయం

నా పేరు మాణిక్యాంబ. నేను సదరు చక్రవర్తికి అమ్మను. కష్టపడి, ఇష్టపడి, ఇవాళ, ఇక్కడ.. ఇలా బ్లాగులొ టపాలు ఎలా వ్రాయాలో నేర్చుకున్నాను. బలే బాగుంది. ఇవాల్టికి చాలు.
టాటా.. బైబై..
వెనకనించి కొడలుపిల్ల నవ్వుతోంది,
చూస్తా.. చూపిస్తా..


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

హమ్మయ్య.. మూడోరోజే ముగించేసారు

మనోళ్ళు, అదే.. మన క్రికెట్ టీమ్ సభ్యులు.. కష్టపడి రెండవ టెస్టుని మూడవరోజునే ముగించేశారు. నాకు టెన్షన్ తగ్గింది. నిన్నటి పుట సమర్పించే సమయానికి మనోళు ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఆ తరువాత నాకు మొదలయ్యింది అస్సలు .. టెన్షన్.. ఎందుకంటే.. నిన్నటి పుటలో నేను, "౩ వరోజునే ఫలితం వెలువడుతుంది.." అని వ్రాసిన తరువాత, మన పాత కెప్టెన్, అదే.. గంగూలి కొంచం బాగా ఆడుతూ ఎదో కనీస ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ప్రక్కన మనోళ్ళు, ఎదో ముసలికన్నీరు మాదిరిగా పోరాటపఠిమతో, సౌత్‍ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కుంటున్నారని ఆనందం.. మరోప్రక్క వీళ్ళు ఈరోజు చివరిదాకా ఆడతారా అన్న అనుమానం..

అన్నింటికి ఒక ముగింపు అన్నట్లుగా ఒకే చరమగీతం పాడేసారు మన టైలేండర్స్.. ఏంచేస్తాం.. ఒక సగటు క్రీఢాభిమానిగా చింతిస్తూ.. ఓ సగటు రాజకీయ వాదిలాగా.. ఖండిస్తున్నాను..

ఆస్ట్రేలియాతో రెండవ టెస్టు - మూడవ రోజు

ఏమిటి .. శౌత్‍ఆఫ్రికాతో రెండవ టెస్టు జరుగుతూ ఉంటే, ఆస్ట్రేలియా అని ఇక్కడ mention  చేసాననుకుంటున్నారా??? నిన్న, మొన్నా జరిగిన మరియు ఇవాళ జరిగుతున్న ఆట తీరు చూస్తే, మనోళ్ళు ఆస్ట్రేలియాలో పడ్డ కష్టాలు గురుకు వస్తున్నాయి. ఏమంటారు?

ఏమిటిది??? సెహ్వాగ్, గౌతమ్‍గంభీర్, రాహుల్ ద్రావిడ్ వంటి మహామహులు తక్కువ స్కోరుకి ఇంటిముఖం పట్టడమేమిటి?? ఎదో పెద్ద పొడిచేస్తాడనుకుని తీసుకొచ్చిన వాసిమ్‍జాఫర్ కాస్తా ౯ (9) & ౧౯(19) పరుగులకు అవుటవడమేమిటి??? ఏంజరుగుతోదిక్కడ.. నాకు తెలియల్సిందే?? మెదటి టెస్టు జరిగిన మైదానము ఆటకు అనుకూలించింది, ప్రస్తుత మైదానంలో ఫలితం తేలదు అని వార్తాపత్రికలు గోడెక్కి కోడై కూసారు .. వ్రాసారు.. కానీ మూడోరోజునే ఈ టెస్టు ఒ కొలొక్కి వచ్చేటట్టుంది.

ఇదంతా, మన బ్యాటింగ్ వైఫల్యమా.. లేక శౌత్‍ఆఫ్రికా బౌలర్ల సాఫల్యమా?? కాలం మనకు ప్రతికూలిస్తోందా.. లేక శౌత్‍ఆఫ్రికకు అను(సా)కూలిస్తోందా?? ఈ వైఫల్యాన్ని, మనం కాలం మీద అభాండంగా అనుకుందామా.. లేక తయరు చేసిన మైదానం మీద కి ఈ అభాండం తోసెద్దామా?? ఎదో తెలుగు సామెత చెప్పినట్లు, "చేత కాక మద్దెల ఓడు అన్నాడట వెనకటికి నాలాంటి వాడొకడు..", అన్నట్లు.. మనోళ్ళలో చావ తగ్గినట్లా?? లేక మనోళ్ళ నిర్లక్ష వైఖరికి ఈ టెస్టు ఒక నిదర్సనంగా మున్ముందు మిగిలిపోతుంది.

మనవాళ్ళ ఆట తీరు మీద మీ అభిప్రాయమేమిటి??

పని సాగనప్పుడు చేసిన పని

ఇవ్వాళ కార్యాలయం (ఆఫీస్) లో నేను చెయ్యాల్సిన పని ఏమత్రం ముందుకు సాగనప్పుడు, ఆటవిడుపుగా ఉంటుందని చేసిన పనులు వాటి వివరాలు ఈ క్రింది విధంగా..

౧) వరూధిని గారి బ్లాగ్ లోని "స్కూటీ నేర్పగలవా.." కు నా అభిప్రాయాన్నితెలియజేయడం

౨) శ్రీవిద్య గారి బ్లాగ్ లోని, "మనిషి గెలవాలంటే మనసు ఓడిపోవాలా..? (నేనొప్పుకోను)" అన్నపుటకి విహారి ఇచ్చిన అభిప్రాన్ని వ్యతిరేకించడం

౩) ఉమామహేస్వరరావు ని చూసి, వాత పెట్టుకుని, ఒక "వ్యక్తిత్వ పరీక్ష"కు హాజరు అయ్యి, దాని ద్వారా తెలిసిన విషయాలను నా వెరే బ్లాగులో భద్రపరిచాను

౪) ఈ బ్లాగు తోలు (skin) ఒలొచి.. వేరేది ఏదైనా వెద్దామని చేసిన ప్రయత్నంలో ప్రస్తుత తోలు నచ్చడంతో ఇలా మార్చేసాను

౫)  నాబ్లాగుని ఎంత మంది, ఎన్ని సార్లు చూస్తారో అన్న కుతూహలంతో.. ఒక కొలతల సంఖ్యామాన కొలబద్దను తగిలించాను.

౬) ఇంకా ఏమి చెయ్యాలోతెలియక ఇదిగో ఇలా..

ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయమాసన్నమయినది.. ఇంతే సంగతులు.. ఇట్లు.. ఓ సగటు సాఫ్ట్‍వేర్ ఇంజినీరు..

హయ్యోరామా.. ఇంకొక విషయం మర్చిపోయాను.. Disclaimer.. కూడా కొత్తగా చేర్చాను. మీఅభిప్రాయములను తెలియజేయడం మరచిపోకుండి.

ఆహారపు అలవాట్లు - నా అభిప్రాయం

ఆహారపు అలవాట్ల గురించి మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు.. పెద్దలే కాకుండా మనం కొన్ని అలవాట్లు వార్తల ద్వారానో.. స్నెహితుల ద్వారానో.. అనుభవాల ద్వారానో.. పరిచయస్తుల సలహాల ద్వారానో .. ఇలా ఎన్నో ఎన్నో మార్గాలలో నేను తెలుసుకున్న .. నాకు మంచిది అనిపించిన పద్దతి మీతో.. ఇలా.. ఇక్కడ..

ఆహారాన్ని మనం ప్రధానంగా ౩ లెదా ౪ (4) సార్లుగా తీసుకుంటాము .. ముఖ్యంగా.. ఉదయం, మధ్య్హాన్నం, సాయంత్రం మరియు రాత్రి వేళలలో.. అదియున్నూ ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లను బట్టి ఆ ఆ వేళలు మారతాయి. నావరకూ నేను ౪ (4) సార్లు భుజించటానికి ప్రయత్నిస్తూ ఉంటాను..

ప్రధానంగా .. అల్పాహారం .. ఎదో సామెత చెప్పినట్లు.. ఉదయం భోగి లాగా .. చాలా దండిగా, కళ్ళకు నిండుగా .. పుష్టిగా లాగించేస్తూ ఉంటాను. ఇక మధ్హ్యాన్న విషయానికి వస్తే .. యోగిలాగా .. కొంచం తక్కువగా, ముఖ్యంగా.. కాయ గూరలతో వండిన కూర, పులుసు వంటివాటితో లాగించేస్తూ పెరుగన్నంతో ముగిస్తాను.

ఇదయిన తరువాత, స్నేహితులు.. సహ ఉద్యోగులు.. పని ఒత్తిడి .. ఎలాగో ఒకలాగా .. ఎదో ఒక కారణంగా ... కాఫీ / టీ వంటి పదార్దాలు వెళుతూనే ఉంటాయి .. ఇలా సాయంకాలమయ్యేటప్పటికి, ఆఫీస్ వాళ్ళు కాస్తా, ఉద్యోగులకోసం అల్పాహారం తెప్పిస్తారనుకోండి.. ఎదో కొంచం పంటి కిందకి తోసేసి, మెల్లగా ఇంటి ముఖం పట్టి, మన హైదరాబాదు ట్రాఫిక్ అనే పద్మవ్యూహాన్ని ఛేధించుకుని ఇంటికి చేరుకునేటప్పటికి తల ప్రాణం తోకలోకి .. క్షమించాలి, మనకి తోకలు ఉండవు కదా.. మరేమని ఇక్కడ ఉపయోగిస్తే బాగుంటుందబ్బా..??!! ఎదోఒకటి.. తల ప్రాణం కాస్తా, పాదాల్లోకి చేరుకుంటుంది. అప్పుడు చక్కగా కాళ్ళు జాపుకుని .. రాత్రి వేళ ఒక రోగి తిన్నట్లు, ఎదో కొంచం లాగించేసి, మజ్జిగ తాగి కసేపు వార్తలు ఆ ఛానల్ .. ఈ ఛానల్ .. ఛానల్స్ అన్నీ ఒకసారి చుట్టేసి, ౧౦:౩౦ (10:30) కి కొంచం అటు ఇటుగా పక్కమీదకి చేరుకుంటాను..

క్లుప్తంగా ౩ ముక్కలో

౧) ఉదయం - భోగి లాగా తినాలి

౨) మద్యలో - యోగి లాగా

౩) రాత్రి వేళ - రోగి లాగా తినడం మనకే మంచిదని నాఅభిప్రాయం.

మరి మీరేమంటారు?

అఖరుగా ఒక ఆంగ్ల సామెత -- During breakfast Eat like KING, while at lunch Eat with Middle class people. Sleep after having the dinner such as any poor man.

ఆశ్చర్యం + భాధ + ..

బాగా చదవడం ఒక విధంగా మంచి పని కాదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది .. ఇదిగో ఇవాళ అనిపించినట్లు.. ఇంతకీ ఏమయిందంటే.. ఇరోజు యధావిధిగా మైక్రోసాఫ్ట్ బ్లగులు చదువుతుంటే.. Kevin Frei .. బ్లాగుని యాదృచ్చికంగా సందర్సించటమయినది.. ఈ మహానుభావుడు తన సోంత విషయాలను వేరే చోట బ్లాగ్ చేస్తున్నారు.

అబ్బో!! ఏమి భాష.. ఏమి వివరణ.. ఏమి పారదర్సకత.. ఎన్నో .. ఎన్నేన్నో .. మరెన్నో విషయాలు .. ఎమాత్రం దాపరికం లేకుండా .. ఏంత విపులంగా .. ఒక వ్యక్తి ఇన్ని విషయాలు ఇలా ఒకే చోట ఇలా పొందు పరచడం చూస్తోంటే.. ముచ్చటేస్తోంది.. అంతే అబ్బుర పడ్డాను కూడా..

ఎంతైనా ఒక వ్యక్తి ఇన్ని విషయాలు ఇలా వ్యక్తీకరిస్తూ ఉంటే.. అతని స్వాతంత్ర్యానికి / అనుభవానికి / తెలివికి / పరిఞానానికి కొంచం అసూయగానూ.. కొంచం భాధగానూ ఉన్నట్లుంది .. అసూయ దేనికంటారా ..  అన్ని సౌకర్యాలు .. అట్టి పని పరిస్తితులు .. ఇంకా.. ఇంకా.. నాకులేవే అని.. "భాధ" ఎందుకంటే.. భావాని వ్యక్తీకరించే భాష ఉన్నా .. భావాన్ని తెలియజేసే ప్రక్రియలో పరిణితి రాలేదే అనేదే..

ఏది ఏమైనా .. ఒక రోజు నేను చాలా స్వాతంత్ర్యంగా .. నిర్మోహమాటంగా .. నిర్బయంగా నా అభిప్రాయాలను ఇక్కడ పొందు పరుస్తాని భావిస్తున్నాను ..

అంతవరకూ .. అపనిలో .. అప్రహతికంగా సాగిపోయే .. ఒ సగటు బ్లాగరు ..

 
Clicky Web Analytics